‘కామన్‌సెన్స్‌ లేదు!.. అందుకే అతడిని పక్కనపెట్టారు’ | Lacks bit common sense IND Legend slams management Kuldeep omission | Sakshi
Sakshi News home page

‘కామన్‌సెన్స్‌ లేదు!.. అందుకే అతడిని పక్కనపెట్టారు’

Oct 15 2026 3:45 PM | Updated on Oct 15 2026 3:53 PM

Lacks bit common sense IND Legend slams management Kuldeep omission

PC: BCCI X

వెస్టిండీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో ఓటమి నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు. చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను పక్కనపెట్టి ఘోరమైన తప్పు చేశారన్నాడు. కాగా భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా.. రెండింట భారత్‌.. రెండింట విండీస్‌ గెలిచి 2-2తో సమంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో తొలి రెండు టీ20లలో భాగమైన స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను.. గత రెండు మ్యాచ్‌ల నుంచి యాజమాన్యం పక్కనపెట్టింది.

రెండు మ్యాచ్‌లలో ప్రదర్శన ఇలా
లక్నో వేదికగా కరేబియన్‌ జట్టుతో తొలి టీ20లో కాస్త పొదుపుగా బౌలింగ్‌ రెండు వికెట్లు తీసిన కుల్దీప్‌ యాదవ్‌.. రాంచిలో జరిగిన రెండో టీ20లో మాత్రం 53 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్‌ తీశాడు. ఈ క్రమంలో ఇండోర్‌లో జరిగిన మూడో టీ20.. తాజాగా బుధవారం నాటి నాలుగో టీ20 నుంచి ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ను తప్పించింది యాజమాన్యం.

ఈ నేపథ్యంలో దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మేనేజ్‌మెంట్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ఉప్పల్‌ వికెట్‌ కాస్త బౌన్సీగా ఉంటుందని అనుకుంటాం. అక్కడ స్పిన్నర్లు కూడా కాస్త ప్రభావం చూపగలరు. అలాంటి చోట కుల్దీప్‌ యాదవ్‌ను పక్కనపెట్టడం నన్ను ఆశ్చర్యపరిచింది.

 కామన్‌సెన్స్‌ కాస్త లోపించింది
ఈ లెప్టార్మ్‌ స్పిన్నర్‌ బౌలింగ్‌లో వెస్టిండీస్‌ బ్యాటర్లు కచ్చితంగా ఇబ్బంది పడేవారే. అతడి గూగ్లీలను ఎదుర్కోలేకపోయేవారు. కానీ యాజమాన్యం మాత్రం అతడినే పక్కనపెట్టింది. కుల్దీప్‌ను ఆడించకపోవడం చూస్తుంటే.. మేనేజ్‌మెంట్‌లో కామన్‌సెన్స్‌ కాస్త లోపించింది అని అనిపిస్తోంది.

హైదరాబాద్‌ మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ ఉండి ఉంటే.. కచ్చితంగా 15-20 పరుగుల తేడా అయినా కనిపించేది. ఇండోర్‌లో బౌండరీ చిన్నగా ఉంటుంది కాబట్టి కుల్దీప్‌ను ఆడించకపోవడాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ హైదరాబాద్‌లో మాత్రం ఇలా చేయడం సరికాదు. రాంచిలో భారత్‌ ఓటమికి కుల్దీప్‌ మాత్రం కారణం కాదు. అయినా సరే ఎందుకో అతడిని పక్కనపెడుతున్నారు’’ అని అశూ యాజమాన్యాన్ని విమర్శించాడు.

చదవండి: IND vs WI: నీకసలు మానవత్వం, క్రీడాస్ఫూర్తి లేవా?: టీమిండియా దిగ్గజం ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement