శాంసన్‌, తిలక్‌ మెరుపులు వృథా.. నాలుగో టీ20లో టీమిండియా ఓటమి | All-Round Windies Beat India To Take Series To Decider | Sakshi
Sakshi News home page

IND vs WI: శాంసన్‌, తిలక్‌ మెరుపులు వృథా.. నాలుగో టీ20లో టీమిండియా ఓటమి

Oct 14 2026 11:04 PM | Updated on Oct 14 2026 11:27 PM

All-Round Windies Beat India To Take Series To Decider

హైద‌రాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన నాలుగో టీ20లో 24 ప‌రుగుల తేడాతో టీమిండియా ఓట‌మి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మరోసారి మెరుపు సెంచరీతో చెలరేగాడు.

ఉప్పల్‌ మైదానంలో కరేబియన్‌ పవర్‌ చూపించాడు. కేవలం 50 బంతుల్లోనే 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. అతడితో పాటు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49) కీల‌క ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, ప్రిన్స్‌ యాదవ్‌ తలా వికెట్‌ సాధించారు.

సంజూ, తిలక్ మెరుపులు వృథా
అనంతరం 248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భార‌త్‌కు సంజూ శాంస‌న్ అద్భుత‌మైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ కేర‌ళ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ త‌నదైన  శైలిలో విండీస్ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. సంజూ కేవ‌లం 20 బంతుల్లో 23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అతడికి తన సహచర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మతో పాటు టాపార్డర్‌ బ్యాటర్లు ఇషాన్‌ కిషన్‌(6), శ్రేయస్‌ అయ్యర్‌(16) నుంచి సహకారం లభించలేదు.

ఉప్పల్‌ అంటే చెలరేగిపోయే అభిషేక్ ఈసారి 24 బంతులు ఎదుర్కొని కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. అయితే మిడిలార్డర్‌లో తెలుగు క్రికెటర్లు తిలక్‌ వర్మ(43), నితీశ్‌ కుమార్‌ రెడ్డి(41) పోరాడారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నప్పుడు భారత్‌ గెలుస్తుందని అంతా భావించారు. 

కానీ వరుస ఓవర్లలో వారు అవుట్‌ కావడంతో అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. ఆఖరికి భారత్‌ లక్ష్య చేధనలో 19.4 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆలౌటైంది. విండీస్‌ బౌలర్లలో కీమో పాల్ 5 వికెట్లతో సత్తాచాటాడు. ఇక సిరీస్‌ డిసైడర్‌ ఐదో టీ20 అక్టోబర్‌ 17న బెంగళూరు వేదికగా జరగనుంది.
చదవండి: నాలుగో టీ20లోనూ సెంచరీ.. చరిత్ర సృష్టించిన హోప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement