జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఘట్‌కేసర్ విద్యార్థికి స్వర్ణ పతకం | DPS-Ghatkesar Student Strikes Gold at 4th DPS National Archery Championship | Sakshi
Sakshi News home page

జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఘట్‌కేసర్ విద్యార్థికి స్వర్ణ పతకం

Nov 29 2026 9:43 PM | Updated on Nov 29 2026 9:46 PM

DPS-Ghatkesar Student Strikes Gold at 4th DPS National Archery Championship

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్), ఘట్‌కేసర్‌కు చెందిన 5వ తరగతి విద్యార్థి ఆకుల నికిత్ శ్రీ చక్రి జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాడు. నవంబర్ 22, 2026న డీపీఎస్ కొల్లూరు వేదికగా జరిగిన 4వ డీపీఎస్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో నికిత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

రికర్వ్ బౌ (అండర్-10) విభాగంలో పోటీపడిన నికిత్, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులను వెనక్కి నెట్టి, అసాధారణ ఏకాగ్రత, కచ్చితత్వంతో అగ్రస్థానంలో నిలిచాడు.

భారత జాతీయ కోచ్ డాక్టర్ రవిశంకర్ పల్లెల పర్యవేక్షణలో చేసిన కఠోర సాధన, అంకితభావమే నికిత్ ఈ అద్భుత విజయం సాధించడానికి దోహదపడ్డాయి. జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించిన నికిత్‌ను, అతని కోచ్ డాక్టర్ రవిశంకర్ పల్లెలను డీపీఎస్-ఘట్‌కేసర్ యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో జరగబోయే మరిన్ని జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో నికిత్ మరెన్నో విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement