జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో నికిత్ శ్రీ చక్రి ఆకుల సత్తా చాటాడు. రికర్వ్ అండర్-10 బాలుర విభాగంలో రజత పతకం గెలిచాడు. అంతేకాదు జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో నికిత్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
2025-26లో నికిత్ శ్రీ చక్రి సాధించిన విజయాలు
జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్ (రికర్వ్ అండర్-10)- సిల్వర్ మెడల్
తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ చాంపియన్‌షిప్స్ (రికర్వ్ అండర్-10)- సిల్వర్ మెడల్
రంగారెడ్డి జిల్లా ఆర్చరీ చాంపియన్‌షిప్ (రికర్వ్ అండర్-10)- గోల్డ్ మెడల్
తమిళనాడు స్టేట్ ఓపెనర్ ఆర్చరీ చాంపియన్‌షిప్ (రికర్వ్ అండర్-10)- గోల్డ్ మెడల్
సౌత్ ఇండియన్ ఓపెనర్ ఆర్చరీ చాంపియన్‌షిప్ (రికర్వ్ అండర్-10)-గోల్డ్ మెడల్


