సంజూ శాంసన్ అరుదైన రికార్డు.. రోహిత్, కోహ్లి సరసన చోటు | IND VS WI 4th T20I: Sanju Samson smashes 100 T20I sixes, joins elite Indian list in record feat | Sakshi
Sakshi News home page

సంజూ శాంసన్ అరుదైన రికార్డు.. రోహిత్, కోహ్లి సరసన చోటు

Oct 15 2026 4:09 PM | Updated on Oct 15 2026 4:15 PM

IND VS WI 4th T20I: Sanju Samson smashes 100 T20I sixes, joins elite Indian list in record feat

source: X

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్‌తో నిన్న జరిగిన నాలుగో టీ20లో 23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేసిన అతడు.. అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్లు బాదిన ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు.

సంజూకు ముందు రోహిత్‌ శర్మ (205), సూర్యకుమార్‌ యాదవ్‌ (179), అభిషేక​్‌ శర్మ (142), హార్దిక్‌ పాండ్యా (!26), విరాట్‌ కోహ్లి (124) మాత్రమే భారత్‌ తరఫున ఈ ఘనత సాధించారు. మొత్తంగా ప్రపంచ క్రికెట్‌లో 100 సిక్సర్ల మార్కును తాకిన 47వ బ్యాటర్‌గా నిలిచాడు. 

అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక టీ20 సిక్సర్ల రికార్డు ఆస్ట్రియాకు చెందిన కరణ్‌బీర్‌ సింగ్‌ (214) పేరిట ఉంది. కరణ్‌ తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు రోహిత్‌ శర్మ పేరిట ఉంది. కరణ్‌, రోహిత్‌ మాత్రమే అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 200 సిక్సర్ల మార్కును తాకారు.

సంజూ మెరుపులు వృథా.. భారత్‌కు ఓటమి
సంజూ సిక్సర్ల రికార్డు సహా మెరుపు ప్రదర్శన చేసినప్పటికీ.. నాలుగో టీ20లో భారత్‌ విండీస్‌ చేతిలో ఓడింది. 248 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్‌ పోరాడినప్పటికీ.. లక్ష్యానికి 25 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సంజూతో పాటు తిలక్‌ వర్మ (43), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (41) భారత్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కీమో పాల్‌ 5 వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టాడు.

అంతకుముందు షాయ్ హోప్ 50 బంతుల్లో అజేయమైన 102 పరుగులు చేసి విండీస్‌ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి రూథర్‌ఫోర్డ్‌ (49 నాటౌట్‌), హెట్‌మైర్‌ (33), ఆండ్రూ (21), పావెల్‌ (24) సహకరించారు. ఈ గెలుపుతో విండీస్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ ఆధిక్యాన్ని తగ్గించి 2-2తో సమంగా ఉంది. సిరీస్‌ నిర్ణయాత్మక చివరి టీ20 అక్టోబర్‌ 17న బెంగళూరులో జరుగనుంది. 

ఇదీ చదవండి: అందుకే ఓడిపోయాం.. అతడు అవుట్‌ కావడం వల్లే ఇలా: సంజూ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement