అందుకే ఓడిపోయాం.. అతడు అవుట్‌ కావడం వల్లే ఇలా: సంజూ | Till that moment we were in chase: Sanju Samson picks turning point Vs WI | Sakshi
Sakshi News home page

అందుకే ఓడిపోయాం.. అతడు అవుట్‌ కావడం వల్లే ఇలా: సంజూ

Oct 15 2026 11:04 AM | Updated on Oct 15 2026 11:13 AM

Till that moment we were in chase: Sanju Samson picks turning point Vs WI

సంజూ శాంసన్‌ (ఫైల్‌ ఫొటో PC: BCCI/X)

వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అనూహ్య రీతిలో భారత్‌ 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా విండీస్‌ 2-2తో సిరీస్‌ను సమం చేయగలిగింది. దీంతో శనివారం నాటి ఆఖరి టీ20లో టీమిండియా చావోరేవో తేల్చుకోవాల్సి పరిస్థితిలో నిలిచింది.

ఈ నేపథ్యంలో నాలుగో టీ20లో ఓటమిపై భారత ఓపెనర్‌ సంజూ శాంసన్‌ స్పందించాడు. ఉప్పల్‌ మ్యాచ్‌లో తమ జట్టు ఆఖరి వరకు పోరాడిందని.. అయితే, లోకల్‌ బాయ్స్‌ తిలక్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి అవుట్‌ కావడం తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నాడు.

చెలరేగిన హోప్‌
కాగా రాజీవ్‌ గాంధీ స్టేడియంలో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ చేయగా.. విండీస్‌ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 247 పరుగులు సాధించింది. కెప్టెన్‌ షాయీ హోప్‌  శతకంతో (50 బంతుల్లో 102)చెలరేగాడు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 19.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ మెరుపు అర్ధ శతకం (23 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) సాధించగా.. వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ (25 బంతుల్లో 43), ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (20 బంతుల్లో 41) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

అయితే, మిగిలిన వారి నుంచి వీరికి సహకారం లభించకపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. భారత ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్లో రొమారియో షెఫర్డ్‌ తిలక్‌ వర్మను అవుట్‌ చేయగా.. 19వ ఓవర్‌ రెండో బంతికి కీమో పాల్‌ నితీశ్‌ రెడ్డిని పెవిలియన్‌కు చేర్చాడు. వీరిద్దరి క్యాచ్‌లను రోవ్‌మన్‌ పావెల్‌ అందుకోవడం గమనార్హం.

వాళ్లిద్దరు క్రీజులో ఉన్నంత వరకు మాదే పైచేయి
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం సంజూ శాంసన్‌ మాట్లాడుతూ.. ‘‘సుమారు 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యాంకర్‌ ఇన్నింగ్స్‌ ఆడితే పనికాదు. అందుకే ప్రతీ ఒక్కరు మొదటి బంతి నుంచే దూకుడు ప్రదర్శించారు. తిలక్‌, రెడ్డి బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపు మేము పోటీలోనే ఉన్నాము.

అప్పటికి ఓవర్‌కు 12-13 పరుగులు మాత్రమే అవసరం. కాబట్టి మేము గెలుపు రేసులో ఉన్నామనే అనుకున్నాం. కానీ తిలక్‌ అవుట్‌ కావడంతో మ్యాచ్‌ కీలక మలుపు తీసుకుంది. విజయానికి చేరువగా వచ్చి మేము ఓడిపోవాల్సి వచ్చింది.

అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు
ఏదేమైనా తీవ్రమైన ఒత్తిడిలోనూ తిలక్‌, రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా శతక వీరుడు షాయీ హోప్‌పై సంజూ ప్రశంసలు కురిపించాడు. 

అతడు అత్యద్బుతంగా ఆడుతున్నాడు
‘‘అతడు అత్యద్బుతంగా ఆడుతున్నాడు. అందుకు మనం అతడిని గౌరవించి తీరాల్సిందే. అద్భుతమైన షాట్లతో వరుస సెంచరీలు చేశాడు’’ అని సంజూ.. విండీస్‌ సారథిని కొనియాడాడు. కాగా టీమిండియాతో వన్డే సిరీస్‌లో రెండు శతకాలు బాదిన హోప్‌.. తాజాగా టీ20 సిరీస్‌లోనూ రెండు సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.

చదవండి: IND vs WI: నీకసలు మానవత్వం, క్రీడాస్ఫూర్తి లేవా?: టీమిండియా దిగ్గజం ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement