టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ సంచలన నిర్ణయం.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై | Punam Raut Announces Retirement From International Cricket After 17-Year Career | Sakshi
Sakshi News home page

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ సంచలన నిర్ణయం.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై

Oct 16 2026 12:47 AM | Updated on Oct 16 2026 12:50 AM

Punam Raut Announces Retirement From International Cricket After 17-Year Career

భారత మహిళా క్రికెట్ జట్టు సీనియర్ బ్యాటర్ పూనమ్ రౌత్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు పూన‌మ్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించింది. 17 ఏళ్ల అద్భుత ప్రయాణానికి తెరదించుతూ  ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె త‌న‌ నిర్ణయాన్ని వెల్లడించింది.  

దేశం తరఫున అత్యున్న‌త స్ధాయిలో  ప్రాతినిధ్యం వహించడం త‌నకు ద‌క్కిన అరుదైన గౌరవమని ఆమె పేర్కొంది. త‌న ఈ సుదీర్ఘ ప్ర‌యాణంలో మ‌ద్ద‌తుగా నిలిచిని  ప్రతి ఒక్కరికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాన‌ని త‌న రిటైర్మెంట్ నోట్‌లో ఆమె రాసుకొచ్చింది.

2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన పూన‌మ్‌.. త‌న కెరీర్‌లో 112 మ్యాచ్‌లు ఆడింది. 37 ఏళ్ల పూనమ్ రౌత్ మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి మూడు వేలకు పైగా పరుగులు సాధించింది. ముఖ్యంగా 2017 ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఆమె అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. 

ఈ టోర్నీలో మొత్తం ఆమె 381 పరుగులు ప‌రుగులు చేసింది. లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో కూడా 86 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఆమె చివరిసారిగా 2021లో ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తరఫున బరిలోకి దిగింది.

క్రీడాస్ఫూర్తికి ప్రతీక
2021లో ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మక పింక్-బాల్ టెస్ట్ మ్యాచ్‌లో ఆమె క్రీడా స్పూర్తి ప్ర‌ద‌ర్శించి అందరి ప్రశంసలు అందుకుంది. బంతి బ్యాట్‌ను తాకినా అంపైర్ నాటౌట్ ప్రకటించినప్పటికీ, తాను ఔట్ అయ్యానని భావించి ఆమె స్వయంగా మైదానం వీడి వెళ్లిపోయింది. దీంతో ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు ప్లేయ‌ర్లు సైతం ఆమె నిజాయితీకి ఫిదా అయిపోయారు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పూనమ్‌ ఇక కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement