ప్రసారభారతి చైర్మన్‌గా ప్రసూన్‌ | Prasoon Joshi was appointed as the new Chairman of Prasar Bharati | Sakshi
Sakshi News home page

ప్రసారభారతి చైర్మన్‌గా ప్రసూన్‌

May 3 2026 5:08 AM | Updated on May 3 2026 5:08 AM

Prasoon Joshi was appointed as the new Chairman of Prasar Bharati

న్యూఢిల్లీ: ప్రముఖ భారతీయ కవి, గేయ రచయిత, స్క్రీన్‌ప్లే రైటర్, కమ్యూనికేషన్స్‌ రంగ నిపుణులు ప్రసూన్‌ జోషికి కీలక పదవి దక్కింది. భారత ప్రభుత్వరంగ బ్రాడ్‌కాస్ట్‌ సంస్థ అయిన ప్రసారభారతి ఛైర్మన్‌గా జోషిని నియమిస్తూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. సాహిత్యం, వాణిజ్య ప్రకటనలు, సినిమా, ప్రజాసంబంధాలు ఇలా విభిన్న రంగాల్లో ప్రసూన్‌ తనదైన ముద్రవేశారు.

 సమకాలీన భారతీయ మీడియా రంగంలో ప్రభావవంతమైన రచనలు చేస్తూ సాంస్కృతిక భిన్నత్వాన్ని కాపాడుతూనే ఆయన భిన్నరంగాలకు సేవచేస్తున్నారని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ప్రసూన్‌ సారథ్యంలో ప్రసారభారతి మరింత శక్తివంతంగా, కొత్త సృజనాత్మక కార్యక్రమాలతో దూసుకుపోవడం ఖాయం. ఈ సందర్భంగా ప్రసూన్‌కు నా శుభాకాంక్షలు’’అని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కొనియాడారు. 

ప్రసారభారతి ఛైర్మన్‌గా నియమించకముందు వరకూ ప్రసూన్‌ 2017 ఆగస్ట్‌ నుంచి ముంబైలోని కేంద్ర సినిమా సరి్టఫికేషన్‌ బోర్డ్‌(సీబీఎఫ్‌సీ)కి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఇన్నేళ్లు సీబీఎఫ్‌సీ చైర్మన్‌గా కొనసాగిన తొలి వ్యక్తిగా ఈయన రికార్డ్‌ సృష్టించారు. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రకటన సంస్థ మెక్‌క్యాన్‌ ఎరిక్సన్‌కు అనుబంధ సంస్థ అయిన మెక్‌క్యాన్‌ వరల్డ్‌ గ్రూప్‌(ఆసియా పసిఫిక్‌)కు ఈయన ఛైర్మన్‌గా, మెక్‌క్యాన్‌ వరల్డ్‌ గ్రూప్‌ ఇండియాకు సీఈఓగా పనిచేశారు. 11 ఏళ్ల క్రితం కేంద్రప్రభుత్వం ఈయనను పద్మశ్రీతో సత్కరించింది.  

 

Advertisement
 
Advertisement
Advertisement