సీఈసీకి ప్రత్యేక అధికారాలు ఉండకూడదు: జస్టిస్ కురియన్ జోసెఫ్ | Former Supreme Court Judge Justice Kurian Joseph On CEC | Sakshi
Sakshi News home page

సీఈసీకి ప్రత్యేక అధికారాలు ఉండకూడదు: జస్టిస్ కురియన్ జోసెఫ్

Oct 14 2026 9:58 PM | Updated on Oct 14 2026 9:58 PM

Former Supreme Court Judge Justice Kurian Joseph On CEC

సాక్షి,న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) వ్యక్తిగతంగా ప్రత్యేక అధికారాలు ఉండకూడదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. ఎన్నికల సంఘం అనేది ఒక వ్యవస్థ అని, దాని అధికారాలు వ్యక్తులపై కాకుండా సంస్థాగతంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, సమగ్రతను కాపాడేందుకు రాజ్యాంగపరమైన రక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు.

కేరళంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నిర్వహించిన ‘భారత ఎన్నికల సంఘం స్వతంత్రత: రాజీపడిందా?’ అనే సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక విధానం, వారి సర్వీసు నిబంధనలకు రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని సూచించారు.

ఎన్నికల కమిషనర్లను తొలగించే ప్రక్రియ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధంగానే ఉండాలని ప్రతిపాదించారు. ఎన్నికల నిర్వహణలో బాధ్యతలు చేపట్టే వ్యక్తుల నిజాయతీపై నమ్మకం లేకపోతే ప్రజాస్వామ్యానికి మూలాల్లోనే ముప్పు ఏర్పడుతుందని జస్టిస్ కురియన్ హెచ్చరించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాల తయారీపై ఎన్నికల సంఘానికి కీలక అధికారాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ అధికారాల వినియోగం వ్యక్తులపై ఆధారపడకుండా, సంస్థ స్వతంత్రతను కాపాడేలా రాజ్యాంగ రక్షణలు ఉండాలని జస్టిస్ కురియన్ జోసెఫ్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: లైంగిక వేధింపుల ఆరోపణలు.. మహిళా జర్నలిస్ట్‌పై ఢిల్లీ ఏసీపీ ఎదురుదాడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement