హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చైర్మన్‌గా రాజీవ్‌ కుమార్‌  | HDFC Bank names ex-Finance Secretary Rajiv Kumar as part-time chairman | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చైర్మన్‌గా రాజీవ్‌ కుమార్‌ 

Jun 30 2026 6:00 AM | Updated on Jun 30 2026 6:00 AM

HDFC Bank names ex-Finance Secretary Rajiv Kumar as part-time chairman

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త పార్ట్‌టైమ్‌ చైర్మన్‌గా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ని బ్యాంక్‌ బోర్డు ఎంపిక చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆయన పదవీకాలం ఉంటుంది. ఈ ఏడాది మార్చి నెలలో అకస్మాత్తుగా వైదొలిగిన అతాను చక్రవర్తి స్థానంలో రాజీవ్‌ కుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. 

అలాగే జూన్‌ 30 నుంచి నాలుగేళ్ల పాటు ఆయన స్వతంత్ర డైరెక్టరుగా ఉంటారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదముద్రకు లోబడి రాజీవ్‌ కుమార్‌ నియామకం ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు, ఆర్థిక రంగానికి పునరుజ్జీవం కల్పించిన వ్యక్తిగా ఆయన పేరొందారు.  2017లో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ కుమార్‌.. నిర్ణయాత్మక విధానాలతో బ్యాంకింగ్‌ను గాడిలో పెట్టారు. ఆయన 25వ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా కూడా సేవలు అందించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement