బీభత్సం సృష్టించిన లేడీ డ్రైవర్.. దూసుకొచ్చిన థార్ | Woman Thar Driver Rams Scooter At Kanpur | Sakshi
Sakshi News home page

బీభత్సం సృష్టించిన లేడీ డ్రైవర్.. దూసుకొచ్చిన థార్

Nov 8 2026 10:40 AM | Updated on Nov 8 2026 10:41 AM

Woman Thar Driver Rams Scooter At Kanpur

కాన్పూర్: దీపావళి పండుగ వేళ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన మహీంద్రా థార్ వాహనం స్కూటీపై వెళ్తున్న 55 ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. థార్‌ను ఓ మహిళ నడుపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. వేగంగా వచ్చిన థార్ వాహనం మొదట రోడ్డుపై పలువురిని ఢీకొట్టి, అనంతరం స్కూటీపై వెళ్తున్న సంతోష్ సింగ్ చౌహాన్‌ను బలంగా ఢీకొట్టింది. థార్‌ ఢీకొన్న వేగానికి స్కూటీని సుమారు 25 నుంచి 30 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి రాకేశ్ కుమార్ తెలిపారు. చివరకు వాహనం రైలింగ్‌ను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. థార్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు ప్రమాదం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. వాహనం వెనుక భాగంలో 'కృష్ణ గ్రూప్' అనే పేరు రాసి ఉన్నట్లు గుర్తించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. అనంతరం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దిలీప్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి కారణాలు, వాహనంలో ఉన్న మహిళల వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. దీపావళి వేళ ఓ కుటుంబంలో విషాదం నింపిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదానికి కారణమైన వాహనం, అందులో ప్రయాణించిన మహిళలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి: టీచర్లకు బీఎల్‌వో విధులు చట్టబద్ధమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement