ఎన్‌కౌంటర్‌ భయం : ఆ నిందితులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు | fake encounter Fear by UP Police 2 gangsters seek shackles bulletproof jackets | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌ భయం : ఆ నిందితులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు

Nov 6 2026 7:28 PM | Updated on Nov 6 2026 7:45 PM

ప్రతీకాత్మకచిత్రం

ఫేక్ ఎన్‌కౌంటర్ (fake encounter) చేస్తారనే భయంతో  ఖైదీలుగా ఉన్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు కోరడం నెట్టింట హాట్‌ టాపిక్‌గా నిలిచింది.  ఉత్తరప్రదేశ్‌లోని తిహార్ జైలు నుండి శామ్లీ కోర్టుకు తరలించే సమయంలో తమకు సంకెళ్లు, బేడీలు వేయడంతో పాటు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు కూడా అందించాలని వీరు అభ్యర్థించారు. దీన్ని కోర్టు అంగీకరించి, సంబంధిత ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

యూపీ పోలీసులు తమను ఎన్‌కౌంటర్‌  పేరుతో చంపేస్తారనే భయం ఉందంటూ నిందితుల తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.  పటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ లాలెర్ ఈ విజ్ఞప్తిని పురస్కరించుకుని, శామ్లీలోని చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ (CJM) కోర్టుకు, తిరిగి తిహార్ జైలుకు తీసుకొచ్చే సమయంలో ​కూడా నిందితులకు బేడీలు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరింప జేయాలని నవంబరు 3న జైలు అధికారులను ఆదేశించారు. నిందితులకు పూర్తి భద్రత కల్పించా లంటూ జైలు అధికారులు, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని స్పష్టం చేస్తూ, ఈ ఉత్తర్వుల ప్రతులను జైలు సూపరింటెండెంట్, సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణమే పంపాలని  కూడాబఆదేశించింది. 

ఇదీ చదవండి: వామ్మో..ఆ స్పీడ్‌ ఏంటి! నువ్వు లక్కీ బ్రో..!

ఆగస్టులో శామ్లీలోని కొత్వాలి ప్రాంతంలోని ఒక జిమ్ వెలుపల హర్యానా గాయకుడు అంకిత్ బాలియాన్‌ను కాల్చి చంపిన కేసులో దీపక్ అలియాస్ తీతర్, యోగేష్ అలియాస్ తుండా అనే ఈ ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను  శామ్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు. దర్యాప్తులో భాగంగా వారిని ట్రాన్సిట్ రిమాండ్‌పై శామ్లీ కోర్టులో హాజరు పరుస్తారు.

ఇదీ చదవండి: అమెరికాలో అదిరిపోయిన సంబరాలు : తొలిసారి ఐదు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement