రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఒక సంఘటన నెట్టింట పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రీంగస్ నుండి ఖాటు శ్యామ్‌జీ వెళ్లే రహదారిపై అతి వేగంగా దూసుకొచ్చిన ఒక బైకర్ రోడ్డు పక్కనే ఉన్న కాంక్రీట్ నిర్మాణాన్ని బలంగా ఢీకొట్టి, గాల్లోకి ఎగిరాడు. ఆ తర్వాత అంతే వేగంతో రోడ్డుపై పడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ బైకర్ బతికే ఉన్నాడా? ఈ భూమ్మిద అతగాడికి ఇంకా నూకలున్నాయా? వీక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నెట్టింట తెగ వైరలవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్‌గా సీసీటీవీ విజువల్స్ ప్రకారం మితిమీరిన వేగంతో వచ్చిన బైకర్ రోడ్డుపక్క ఉన్న ఒక పెద్ద దిమ్మను బలంగా ఢీకొట్టాడు. ఎంత బలంగా అంటే.. దెబ్బకి ఆ ధాటికి గాలిలోకి ఎగిరి బలంగా రెడ్డుపై పడ్డాడు. కొద్ది క్షణాల్లోనే ఆ వ్యక్తి ఎవరి సహాయం లేకుండానే లేచి నిలబడి, ప్యాంటు దులుపుకుంటూ లేచి.. కామ్‌గా వెళ్లిపోయాడు. పెద్దగా గాయాలైనా దాఖలాలు కూడా ఏమీ లేవు.
🚨 MOTORCYCLIST THROWN ONTO ROAD AFTER CRASHING INTO ROADSIDE STRUCTURE IN RAJASTHAN CCTV footage from the Reengus–Khatu Shyamji road in Sikar district, Rajasthan captures a motorcyclist crashing into a roadside board and concrete structure. The impact throws the rider several feet into the air before he lands on the road. Moments later he gets back on his feet on his own. 🎥 CCTV Footage #Khatushyamji #RoadAccident
— contentkikamii (@contentkikamii) November 5, 2026
నెటిజన్లు షాక్
ఇదొక అద్భుతం అని కొందరు, మరికొందరు ఇది కేవలం అదృష్టం అని మరికొందరు కామెంట్స్ చేశారు. ఇదేం యాక్సిడెంట్ భయ్యా, మనోడికి భూమ్మీద ఇంకా నూకలు మిగిలే ఉన్నాయ్! అని మరికొందరు ఆశ్చర్యాన్ని ప్రకటించారు. యముడు holiday లో ఉండి ఉంటాడని కొందరు వ్యాఖ్యానించారు.
అతని ఆ బైకర్ తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయినప్పటికీ, పరిస్థితి ఎలా ఉంది, తలకు ఏమైనా దెబ్బలు తగిలియా అనేది వీడియో ఆధారంగా చెప్పడం మాత్రం కష్టం. దీనిపై అతని బంధువులునుంచి గానీ, పోలీసుల నుంచి గానీ ఎలా ప్రకటన వెలువడలేదు. ఇలాంటి ప్రమాదాలలో వాహనం కిందపడే విధానం, కిందపడే ప్రదేశం, రక్షణ పరికరాలు ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని రహదారి భద్రతా నిపుణుల మాట.. అతను హెల్మెట్ ధరించాడో లేదో స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఎవరెన్ని ఊహలు చేసినప్పటికీ, వైద్య పరీక్షల ద్వారా మాత్రమే ఆయన ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుస్తుంది.
నోట్ : ఏది ఏమైనా అతివేగం అనర్థం. వాహనంపై నియంత్రణ లేకపోవడం ప్రమాదం. హెల్మెట్ ధరించడం చాలా కీలకం. మితిమీరిన వేగం, ఇతర వాహనదారుల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది అనేది గమనించాలి.


