రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న 'ఇన్‌ఫ్లూయిష్' (Influish) సంస్థ, దీపావళి సందర్భంగా ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన ఉద్యోగ ప్రకటనతో వార్తల్లో నిలిచింది. రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ, ఆ ప్లాట్‌ఫామ్‌లో ట్రెండింగ్‌లో , వైరల్ అవుతున్న వాటిపై రిపోర్ట్ చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి కోసం ఈ సంస్థ వెతుకుతోంది. ఈ ఉద్యోగాన్ని వివరిస్తూ, ఆసక్తిగల అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో తెలియజేస్తూ, ఆ సంస్థ ఉద్యోగులు సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకోవడం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇక్కట ఇంకో ట్విస్ట్ ఉంది.
ఇదీ చదవండి: పండగవేళ పతంజలికి భారీ షాక్ : తుకారం ముండే దెబ్బ
ఈ వినూత్న ఉద్యోగం పేరే 'డూమ్‌స్క్రోలర్' (Doomscroller).రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ, ఏవి ట్రెండ్ అవుతున్నాయి, ఏవి వైరల్ అవుతున్నాయి అనే విషయాన్ని రిపోర్ట్ చేయాలన్నమాట. ఆ వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడే శైలి అందరినీ ఆకట్టుకుంటోంది. "మీకు నిజంగా ఇన్‌స్టాగ్రామ్ వాడటం బాగా ఇష్టమైతే, దానికే మేము మీకు జీతం ఇస్తాం. రోజంతా ప్రశాంతంగా కూర్చుని రీల్స్ స్క్రోల్ చేస్తూ... ఇన్‌స్టాగ్రామ్‌లో ఏవి వైరల్ అవుతున్నాయో అందరికీ చెప్పే ఒక మంచి 'డూమ్‌స్క్రోలర్' మాకు కావాలోయ్!" అని పేర్కొన్నారు. ఫుల్ టైమ్ & ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగంపై ఆసక్తి ఉన్నవారు సదరు వీడియో కింద 'Hi' అని కామెంట్ చేయాలని కోరారు. ఉదయ్‌పూర్‌లో ఉండే అభ్యర్థులకు డైరెక్ట్ మెసేజ్ (DM) ద్వారా అప్లికేషన్ లింక్‌ను పంపుతామని తెలిపారు. అంటే ఉదయ్‌పూర్ వాసులకే ఈ ఉద్యోగం సొంతం. అదన్నమాట ట్విస్ట్.
ఇదీ చదవండి: చెఫ్ కొంపముంచిన ‘పైనాపిల్ పిజ్జా’
నెటిజన్ల పండగ
రోజంతా ఫోన్‌లో రీల్స్ చూడటమే పనిగా మారే ఈ ఆఫర్ చూసి నెటిజన్లు "మా డ్రీమ్ జాబ్ దొరికేసింది!" అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇన్‌ఫ్లూయిష్ అనేది కంటెంట్ క్రియేటర్స్ (ఇన్‌ఫ్లుయెన్సర్స్) , బ్రాండ్‌లను నేరుగా కనెక్ట్ చేసే భారతదేశపు అతిపెద్ద క్రియేటర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి.
ఇదీ చదవండి: డాగ్ ఎటాక్ : రక్తసిక్తమైన నటి ముఖం, మాయని మచ్చ..అందుకే!


