డాగ్‌ ఎటాక్‌ : రక్తసిక్తమైన నటి ముఖం, మాయని మచ్చ..అందుకే! | Natasha Wilson Reveals Why She Stayed Away From Acting After Dog Attack Left Permanent Facial Scar, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

డాగ్‌ ఎటాక్‌ : రక్తసిక్తమైన నటి ముఖం, మాయని మచ్చ..అందుకే!

Nov 5 2026 3:23 PM | Updated on Nov 5 2026 3:54 PM

Natasha WilsonLeft With Permanent Disfigurement After Vicious Dog Attack In Hollywood Park

ప్రముఖ నటి  నటాషా విల్సన్‌కు సంబంధించిన ఒక షాకింగ్ వార్త  నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 2024 నవంబర్‌లో ఆమెపై జరిగిన కుక్క దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాస్ ఏంజిల్స్ ప్రాంతంలోని ఒక పార్కులో కుక్క దాడి కారణంగా తన ముఖం శాశ్వతంగా వికృతంగా మారిందని, తన నటనా వృత్తి కూడా ప్రభావితమైందని ఆరోపిస్తూ 'లైఫ్‌టైమ్' నటి నటాషా విల్సన్ దావా వేశారు. దీని కారణంగా కరియర్‌లో తానెంతో నష్టపోయానని, వైద్య ఖర్చులు, కోల్పోయిన అవకాశాలు కోల్పోయిన ఆదాయం,  భవిష్యత్తు ఆదాయ నష్ట పరిహారాన్ని ఇప్పించాలని కోరుతూ న్యాయపోరాటానికి దిగారు.

న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం... నటాషాకు కుక్కలంటే ప్రాణం. ఆమె సోషల్‌ మీడియా నుంచి పెట్‌ డాగ్స్‌  ఫోటోలతో నిండి ఉండటమే ఇందుకు నిదర్శనం. 2024 నవంబర్ 7న రాత్రి దాదాపు 9:40 గంటల సమయంలో నటాషా లాస్ ఏంజెల్స్‌లోని ఒక డాగ్ పార్క్‌లో తన పెట్‌ డాగ్‌ను వాకింగ్‌కు తీసుకెళ్లింది.. అయితే అదే సమయంలో గ్రెగొరీ మార్సెల్ అనే వ్యక్తి కూడా తన 'స్క్రఫీ' అనే పెంపుడు కుక్కతో అక్కడికి వచ్చాడు. సడన్‌గా ఆ స్క్రఫీ నటాషా కుక్క వైపు దూసుకొచ్చి, చాలా దూకుడుగూ  దూసుకొచ్చింది.  ప్రమాదాన్ని పసిగట్టిన నటాషా వెంటనే తన కుక్కను చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. దీంతో  స్క్రఫీ ఒక్కసారిగా నటాషాపైకి లంఘించింది. దాంతో ఆమె చేతుల్లోంచి కుక్క కిందపడిపోయింది. తన  పెంపుడు కుక్కను  కాపాడుకునే  ప్రయత్నంలో నటాషా  గాయాలయ్యాయి.  స్క్రఫీ  నటాషా కుడి కంటిబొమ్మపై దాడి చేసి తీవ్రంగా కరిచేసింది. దాంతో ఆమె ముఖం రక్తసిక్తమైంది.

'ది బెస్ట్ వర్షన్ ఆఫ్ లవ్', 'సింగిల్ అండ్ రెడీ టు జింగిల్', 'అన్‌రియల్', 'డిఏఆర్‌సి' వంటి ప్రముఖ టీవీ సిరీస్‌లు, సినిమాల ద్వారా  పాపులర్‌ అయిన నటి నటాషా 2024 ఆగస్టులో వచ్చిన 'ట్రస్ట్ ఇన్ లవ్' ప్రాజెక్ట్‌లో ఆమె చివరిగా కనిపించారు. ఆ తర్వాత నుండి ఆమె ఏ కొత్త ప్రాజెక్ట్‌కూ సంతకం చేయలేదు. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని తాజాగా వెల్లడించింది.

శాశ్వత మచ్చ,  తగ్గిపోయిన అవకాశాలు

ఈ దాడి తర్వాత డిఫెండెంట్ మార్సెల్, నటాషాను వెంటనే సీడార్స్-సినాయ్ ఎమర్జెన్సీ రూమ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు కుట్లు వేసి, యాంటీబయాటిక్స్ ఇచ్చారు. అయితే ఈ దాడి వల్ల ఆమె కుడి కంటిబొమ్మ పైభాగంలో తీవ్రమైన నరాల దెబ్బతినడంతో కంటిబొమ్మ కదలిక తగ్గిపోవడమే కాకుండా, అక్కడ జుట్టు పెరిగే విధానం కూడా మారిపోయిందని  ఆమె ఆరోపించారు. అంతేకాదు ప్రస్తుతం ఆ గాయం ఒక శాశ్వతమైన మచ్చగా మారిపోవడంతో, దాన్ని సరిచేయడానికి సర్జరీ (Scar revision surgery) చేయించుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.   ఫలితంగా  ఆమె నటనకే కాక, రోజువారీ పనులకు కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. దీనివల్ల ఆర్థికంగా భారీగా నష్టపోయానని, నటనపైనే ఆధారపడ్డ తన కెరీర్‌ దెబ్బతిందని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణలు కోర్టులో ఇంకా రుజువు కాలేదు. అలాగే  ఈ దావాపై మార్సెల్ ఇంకా స్పందించలేదు. 

ఎవరీ నటాషా విల్సన్ 
న్యూయార్క్ నగరంలో జన్మించిన నటాషా, సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ (USC) నుండి డిగ్రీ పూర్తి చేశారు. 'అన్‌రియల్' సిరీస్‌లో 'మాయ' పాత్ర ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. IMDb ప్రకారం 2023 వరకు వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నటాషా, ఈ ఘోర ఉదంతం తర్వాత సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. 2025 జూన్ తర్వాత ఆమె నుంచి ఎలాంటి పోస్టులు రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement