ఆటో నడుపుతూనే సూపర్‌ టెట్‌కి సన్నద్ధం..! | Viral Video: Amethis Suraj Drives Auto, Prepares For Super TET | Sakshi
Sakshi News home page

ఆటో నడుపుతూనే సూపర్‌ టెట్‌కి సన్నద్ధం..! మనసుని కదిలించే కథ..

Nov 5 2026 11:45 AM | Updated on Nov 5 2026 11:45 AM

Viral Video: Amethis Suraj Drives Auto, Prepares For Super TET

చాలామంది తమ కల కోసం నిశబ్దంగా పోరాడుతుంటారు. ఎంతలా అంటే..పాపం వాళ్ల కష్టాన్ని చూస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అబ్బా ఈసారి అయినా దేవుడి కరుణించి అతడి ఆశయం నెరవేరేలా చేస్తే బాగుండు అని ఇతరులు సైతం అభిలాషిస్తారు. అలాంటి భావోద్వేగ కథే నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఆ స్ఫూర్తిదాయక కథేంటో చూసేద్దామా

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో సూరజ్‌ తివారీ అనే వ్యక్తి ఆటో రిక్షా నడుపుతూనే 'సూపర్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్' (Super TET) కోసం సిద్ధమవుతున్నాడు. అతడి ఆటోలోనే ప్రయాణిస్తున్న మల్లికా అగర్వాల్‌ అనే మహిళా ప్రయాణికురాలు అతడితో మాటలు కదిపి..వారి మధ్య జరిగిన సంభాషణను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో అతడి కథ నెట్టింట వైరల్‌గా మారింది. కొన్ని స్ఫూర్తిదాయకమైన కథ మన పక్కనే ఉంటాయి, అవి ఇంటర్నెట్‌లో కూడా కానరావు. పాపం వాళ్లు ఎంతలా నిశబ్దంగా తమ కల కోసం తపిస్తుంటారో వారిని కదిలిస్తే లేదా గమనిస్తే గానీ తెలియదు. 

ఆ వీడియోలో ఆ ప్రయాణికురాలు "ఈ రోజు నాకు ఒక ఆటో డ్రైవర్‌ పరిచయమయ్యారు. ఆయన తన రోజువారీ పనిచేసుకుంటూనే 'సూపర్ టెట్' పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ప్రజలను వారి గమ్యస్థానలకు చేరుస్తూనే తన సొంత లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తున్నాడు. ఆయన పడుతున్న కష్టానికి తగిన ఫలితం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేద్దామా". అంటూ తన సంభాషణను ముగించింది. 

అంతేగాదు ఆ వీడియోకి ఒక వేళ మీరు కూడా అతడిలానే బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏదైనా పరీక్ష ​కోసం సన్నద్ధమవుతుంటే..ఈ కథ మీ కోసమే అని క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేసింది. ఇక ఆ వీడియోలో సూరజ్‌ మాటలు కూడా క్లియర్‌గా వినిపిస్తున్నాయి. తాను అమేథీకి చెందిన వాడినని, గతేడాది నుంచే లక్నోలో ఉంటున్నానని చెప్పడం చూడొచ్చు. అలాగే ఏదైనా సీబీఎస్‌ఈ(CBSE) పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేయాలని ఆశతో వచ్చా..కానీ అది అంత సులభం కాలేదని బాధగా చెప్పుకొచ్చాడు. 

ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులన్నీ దాదాపు మహిళలతోనే నిండి ఉన్నాయని, తనకు అవకాశం దక్కడం చాలా కష్టమైందని అన్నాడు. అందుకే తన ఖర్చుల కోసం ‘రాపిడో’(Rapido) ద్వారా ఆటో నడపడం మొదలుపెట్టినట్లు తెలిపాడు. దాంతోపాటు సూపర్‌టెట్‌ పరీక్షకి కూడా ప్రిపేరవుతున్నట్లు చెప్పాడు. తనకు సమయం దొరికనప్పుడల్లా చదువుతున్నానని, తన కలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలనని ఆత్మవిశ్వాసంగా చెప్పాడు. ఆ వీడియో నెటిజన్లను సైతం కదిలించింది. బ్రో నువ్వు నిజంగా సాధిస్తావు అని కొందరు, అతడి కళ్లల్లో నీళ్లు స్పష్టంగా కనిపించాయని మరికొందరు కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.  కాగా ఉత్తరప్రదేశ్‌లో ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో అసిస్టెంట్ టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్షనే ఈ సూపర్‌ టెట్‌.

 

ఇదీ చదవండి: థియేటరే ఇల్లు.. సినిమానే ప్రపంచం! జస్ట్‌ ఒక్క ఏడాదిలోనే 1,207 సినిమాలు..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement