కణితి కాదు..శ్వాసనాళంలో పన్ను! వైద్యులే షాక్‌ | Health: Doctors suspect lung tumour in 72-year-old with chronic cough But | Sakshi
Sakshi News home page

కణితి కాదు..శ్వాసనాళంలో పన్ను! వైద్యులే షాక్‌

Nov 4 2026 5:28 PM | Updated on Nov 4 2026 5:28 PM

Health: Doctors suspect lung tumour in 72-year-old with chronic cough But

ఒక వ్యక్తి నిరంతరం దగ్గుతో బాధపడుతుంటే..ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపుడుతున్నారనే అనుకుంటారు ఎవ్వరైనా. శ్వాసకోశ సమస్యగానే భావించారు వైద్యులు కూడా. అయితే పదపదే ఈ దగ్గు సమస్య అతడిని విపరీతంగా వేధించడంతో లంగ్‌ ట్యూమర్‌గా అనుమానించి శస్త్ర చికిత్స చేయగా అసలు విషయం తెలిసి వైద్యులు సైతం కంగుతిన్నారు. అంతేగాదు ఆ వృద్ధుడి దీర్ఘకాలిక దగ్గు వెనుక నిజం ఇదా..! అని వైద్యులంతా విస్తుపోయారు. 

అసలు ఏం జరిగిందంటే..ఒక 72  ఏళ్ల వృద్ధుడికి నిరంతరం దగ్గుతో పదేపదే ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండేవాడు. అతడు ఇంతల విపరీతమైన దగ్గుతో ఇబ్బందిపడుతున్నాడంటే బహుశా శ్వాసనాళంలో కణితి ఉందేమోనని అనుమానించారు వైద్యులు. అలా అని ఆ వృద్ధుడికి ఎలాంటి కేన్సర్‌ చరిత్ర లేదు. గుండె జబ్బులు ఉన్నాయి కానీ, బరువు తగ్గడం, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి ఇబ్బందులేమి లేవు. 

సరే అని వైద్యులు సీటీ స్కాన్‌  చేయించగా అతడికుడి ఊపిరితిత్తుల్లో ఒక చిన్న వాయుమార్గంలో ఏదో అడ్డంకి ఉన్నట్లు గుర్తించారు. ఆ అడ్డంకి ఆవల వాపు ఉన్నట్లు తేలింది. అయితే వైద్యులు దీన్ని కణితిగా అనుమానించారు. కానీ వాయుమార్గం లోపలికి చూడటానికి బ్రాంకోస్కోపీని ఉపయోగించారు. ఆ పరీక్షలో ప్రభావితమైన మార్గాన్ని పూర్తిగా అడ్డకుంటున్న స్పష్టమైన రక్తనాళాలతో కూడిన నునుపైన, ఎర్రటి పెరుగుదలను గుర్తించారు. దాని రూపాన్ని బట్టి వైద్యుల కణితి అయి  ఉండొచ్చని అనుకున్నారు. 

అయితే ఆ అడ్డంకిని తొలగించడానికి ఒక స్నేర్‌ క్రయోప్రోబ్‌ పరికరాన్ని ఉపయోగించి తొలగించే ప్రయత్నం చేయగా..దాని కింద నుంచి ఒక గట్టి తెల్లని వస్తువు బయటపడింది. అది తెల్లగా నున్నగా ఉండటంతో ఆ వస్తువు ఉపరితలాన్ని పరికరం పట్టుకోలేకపోయింది. అనేక ప్రయత్నాల తర్వాత రిట్రీవల్‌ బాస్కెట్‌ ఉపయోగించి బయటకు తీయగా..అది ఒక మనిషి పన్నే అని తేలింది. దాంతో వైద్యులు అతడి దంత చరిత్ర గుర్తించి ప్రశ్నించారు. సుమారు మూడేళ్ల క్రితం స్పృహ కోల్పోయినప్పుడూ పన్ను ఊడిపోయిందని, అది తన శ్వాసనాళంలోకి వెళ్లిపోయి ఉండొచ్చని చెప్పాడు. 

ఆ సంఘటన సమయంలో ఆ పన్ను తన శ్వాసనాళంలోకి వెళ్లినట్లు తనకసులు తెలియదని కూడా చెప్పాడు. ఆ తర్వాత నుంచే ఆ వృద్ధుడికి దీర్ఘకాలిక చికాకు, పనరావృతమయ్యే ఇన్ఫెక్షన్లకు దారితీసిందని గుర్తించారు వైద్యులు. అయితే తాము కూడా సీటీ స్కాన్‌లో దానిపై కణజాలం ఏర్పడటంతో తాము కూడా కణితిగానే అనుమానించాం తప్ప పన్నుగా గుర్తించలేకపోయామని అన్నారు వైద్యులు. అంటే ఇతర వస్తువులు మానవ శరీరంలోకి వెళ్లాక అవి కణజాలాన్ని ఏర్పరుచుకుని కణితిలా కనిపిస్తాయనేందుకు ఈ కేసునే ఉదాహరణ అని అన్నారు.

ఇదీ చదవండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement