చెఫ్‌ కొంపముంచిన ‘పైనాపిల్‌ పిజ్జా’ | Italian chef fired from restaurant after refusing to serve pineapple pizza calls it an insult to his culture | Sakshi
Sakshi News home page

చెఫ్‌ కొంపముంచిన ‘పైనాపిల్‌ పిజ్జా’

Nov 5 2026 5:49 PM | Updated on Nov 5 2026 5:49 PM

Italian chef fired from restaurant after refusing to serve pineapple pizza calls it an insult to his culture

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఉన్న ఒక రెస్టారెంట్‌లో పనిచేసే ఇటాలియన్ చెఫ్, పిజ్జావివాదంతో ఉద్యోగాన్నే కోల్పోయాడు. పిజ్జాలపై పైనాపిల్ ..నెవ్వర్‌.. అది తన సంస్కృతికి అవమానమని భీష్మించు కూర్చున్నాడు. దీంతో ఆయనను ఉద్యోగం నుండి తొలగించారు. 'అన్యాయంగా తొలగించారంటూ' (unfair dismissal) ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఫిర్యాదును కమిషన్ కొట్టివేసింది.

బీబీసీ కథనం ప్రకారం  ప్రకారం ఇటలీకి చెందిన డేవిడ్ తంబురెల్లా అనే చెఫ్ బ్రిస్బేన్‌లోని ప్రముఖ రెస్టారెంట్‌ 'లా కోస్టా' లో పనిచేసేవాడు. మే నెలలో కంపెనీ యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. సరిగ్గా రెండు వారాల ముందు అతని ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదులపై మేనేజ్‌మెంట్ అతనితో ఒక సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా  రెస్టారెంట్‌లో జరిగిన ఒక ఫంక్షన్ కోసం 'హామ్ అండ్ పైనాపిల్ పిజ్జా' తయారీకి నిరాకరించడం ఈ విమర్శల్లో ప్రధానమైంది.


పిజ్జాపై మైనాస్‌లు, కారాలు ఏవైనా ఓకే కానీ...పైనాపిల్ ముక్కలా? ఇలాంటి విచిత్రమైన ఆర్డర్లు  తన ఇటాలియన్ సంస్కృతికే అవమానం అంటూ  వాదించాడు. యాజమాన్యం చెప్పినా సరే నా సంస్కృతికి విరుద్ధమైన పనులను చేయను అని  డేవిడ్ కరాఖండిగా చెప్పేశాడు. చెఫ్‌ను కంపెనీ ఉద్యోగంలోంచి తీసేసింది. దీనిపై కోర్టుకెళ్లిన ఆయనకు మరో ఎదురుదెబ్బ తప్పలేదు.

తనను ఉద్యోగం నుంచి అన్యాయంగా తీసేశారంటూ డేవిడ్ ఆస్ట్రేలియాలోని 'ఫేర్ వర్క్ కమిషన్'ను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

నిజానికి ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం (PR) పొందడానికి ఈ రెస్టారెంట్ స్పాన్సర్‌షిప్ వస్తుందని డేవిడ్ ఆశపడ్డాడు. కానీ ఉద్యోగం పోవడంతో ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆయన వేసిన 'అన్యాయమైన తొలగింపు' (Unfair dismissal) పిటిషన్‌ను కూడా కమిషన్ కొట్టేసింది.  ప్రస్తుతం ఈ రెస్టారెంట్ మూసివేశారు..

గతంలోనూ  మూడుసార్లు 
డేవిడ్ ఇలా చేయడం ఇదే  ఫస్ట్‌ టైం కాదట! గడిచిన నాలుగేళ్లలో పైనాపిల్ పిజ్జా చేయడానికి నిరాకరించడం ఇది మూడోసారి. "ఇటాలియన్లకు పిజ్జాపై పైనాపిల్ వేయకపోవడం ఎంత ముఖ్యమో ఒకసారి గూగుల్ చేసి చూడండి" అని ఆయన గతంలో తన ఓనర్‌కే క్లాస్ తీసుకున్నట్లు తేలింది.

ఇక్కడ ఇంట్రస్టింగ్‌ ట్విస్ట్ ఏంటంటే... ఈ రెస్టారెంట్ ఉన్న 'క్వీన్స్‌ల్యాండ్' రాష్ట్రం ఆస్ట్రేలియాలోనే పైనాపిల్స్ ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్! దేశంలో దొరికే పైనాపిల్స్ అన్నీ అక్కడే పండుతాయి. అలాంటి చోట ఉంటూ పైనాపిల్ పిజ్జా చేయనని ఆయన భీష్మించుకుని కూర్చోవడం అక్కడివారిని ఆశ్చర్యపరిచింది.

ఇదీ చదవండి: పండగవేళ పతంజలికి భారీ షాక్‌ : తుకారం ముండే దెబ్బ

యాజమాన్యం చెప్పిన దాని ప్రకారం డేవిడ్‌ను ఉద్యోగం నుంచి తీసేయడానికి కేవలం పిజ్జా ఒక్కటే కారణం కాదట. ఆఫీసులో బూతులు మాట్లాడటం, తోటి సిబ్బందితో ఘర్షణ పడటం, తరచూ కోపంతో ఊగిపోవడం వంటివి కూడా కారణాలని రెస్టారెంట్ వర్గాలు తెలిపాయి. గత ఏప్రిల్‌లో ఆయన కోపంతో ఆఫీసులోని ఒక మెటల్ హ్యాండ్‌రైల్‌ను గట్టిగా కొట్టడంతో ఆయన కుడిచేతి ఎముకలు కూడా విరిగాయని కమిషన్ విచారణలో తెలిసింది.

ఇదీ చదవండి: డాగ్‌ ఎటాక్‌ : రక్తసిక్తమైన నటి ముఖం, మాయని మచ్చ..అందుకే!


 

ఈ గొడవపై రెస్టారెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎలియట్ ఇంగ్రామ్ స్పందిస్తూ... "ఇది కేవలం పిజ్జా టాపింగ్స్ గురించిన కథ మాత్రమే కాదు, దీని వెనుక చాలా అంశాలున్నాయనివ్యాఖ్యానించారు.

మరోవైపు డేవిడ్ తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో "ఆహారాన్ని, పదార్ధాలను గౌరవించడం" గురించి గొప్పగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన బ్రిస్బేన్‌లోని మరొక రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement