మెటా, టిక్‌టాక్‌పై కేసు : 12 ఏళ్ల రోసెల్లా విషాద గాథ | Italian Woman Takes On Meta TikTok After Daughter Tragic Incident, Sparks Global Debate On Algorithm Risks | Sakshi
Sakshi News home page

మెటా, టిక్‌టాక్‌పై కేసు : 12 ఏళ్ల రోసెల్లా విషాద గాథ

Jun 17 2026 1:20 PM | Updated on Jun 17 2026 2:13 PM

 Italian Woman Takes On Meta TikTok After Daughter tragic incident

రెండువైపులా పదునున్న కత్తి సోషల్ మీడియా. సోషల్‌ మీడియా యాప్స్‌ను స్క్రోలింగ్‌  అనేది పిల్లలు పెద్దలు తేడా అనే లేకుండా ఒక వ్యసనం లేకుండా మారిపోయింది.  సోషల్‌ మీడియా అల్గారిథమ్‌తో యువతపై పడుతున్న ప్రతికూల ప్రభావాలు ఇన్నీ అన్నీ కావు.  సోషల్ మీడియా సంస్థలపై ఉమ్మడి చట్టపరమైన చర్యలు ఇటలీలో తల్లిదండ్రులు చేస్తున్న న్యాయపోరాటం ఈ విషయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.  ఐరోపా అంతటా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై విమర్శలు తీవ్రమవుతున్నారు. మరోవైపు ఇటీవలే బ్రిటన్ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన నేపథ్యంలో ఇది మరింత ప్రాధాఘ్యతను సంతరించుకుంది. 12 ఏళ్ల బాలిక రోసెల్లా  ఆత్మహత్య  వెనుకున్న అత్యంత విషాదకరమైన  విషయాలగురించి తెలుసుకుందాం.  


సోషల్ మీడియాలో విపరీతంగా ఆత్మహత్య , డిప్రెషన్‌కు సంబంధించిన కంటెంట్‌ను చూసిన తర్వాత తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని రోసెల్లా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఆమె మరణం తర్వాతే తల్లి ఇరీన్ రొగ్గెరో ఉగ్వెస్,  ఆమె భర్త  రోసెల్లా డివైజ్‌లను అన్‌లాక్ చేశారు.  దీంతో విషయం తెలిసి షాక్‌ అయ్యారు. దీనిగురించి ప్రపంచాన్ని హెచ్చరించాలని నిర్ణయించుకున్నారు.

విషయం ఏమిటంటే..

తమ కుమార్తె రోసెల్లా  సోషల్ మీడియాను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు  గుర్తించారు.  మరీ ముఖ్యంగా  ఆమె ఒక రహస్య ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను వాడుతోందనీ, అందులో   'o'కు బదులుగా 'zero'తో 'Just a dead pers0n' అనే  పేరుతో  అకౌంట్‌ను నడుపుతోందని గమనించారు.

2023 సెప్టెంబర్‌లో రోసెల్లా తన మానసిక స్థితికి తగ్గట్టుగా డిప్రెషన్ కంటెంట్ కోసం వెతకడం ప్రారంభించగానే, సోషల్ మీడియా అల్గారిథమ్‌లు ఆమెకు అలాంటి కంటెంట్‌నే పదే పదే చూపించాయనీ, కేవలం ఐదు నెలల్లోనే (2024) ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.

ఈ వ్యవహారంపై రోసెల్లా తల్లిదండ్రులతో పాటు ఇటలీలోనిమరికొన్ని కుటుంబాలు కలిసి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మాతృసంస్థ  మెటా (Meta) , టిక్‌టాక్ (TikTok)లపై కోర్టులో కేసు వేశారు. మైనర్లకు సోషల్ మీడియా యాక్సెస్‌పై కఠినమైన పరిమితులు విధించాలని, దీనివల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన పెంచాలని  వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. 

ఆ అల్గారిథం లేకపోతే, ఆమె వేదన - లేదా సైకోసిస్, లేదా  మానసిక  బాధను, లేదా అంతకుమించి మరేదైనా గానీ  తానుతన కూతురికి జరిగిన ఘోరం మరే ఇతర బిడ్డకు జరగకూడదని, సోషల్ మీడియా వెనుక ఉన్న సాంకేతిక ప్రమాదాల గురించి మిగతా తల్లిదండ్రులను అప్రమత్తం చేయడానికే తాను ఈ న్యాయపోరాటంలో చేరానని రోసెల్లా తల్లి ఇరేన్ స్పష్టం చేశారు. 

మరోవైపు ఈ ఆరోపణలను మెటా, టిక్‌టాక్ సంస్థలు తిరస్కరించాయి. తాము టీనేజర్ల రక్షణ కోసం 'టీన్ అకౌంట్స్' హానికరమైన కంటెంట్‌ను తొలగించే ఫిల్టర్లను ఉపయోగిస్తున్నామని, యువత మానసిక ఆరోగ్యం వెనుక అనేక ఇతర కారణాలు కూడా ఉంటాయని అవి పేర్కొన్నాయి. యూజర్ల మానసిక,  ప్రవర్తనా ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో రూపొందించిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయడం తమ ప్రయత్నాలలో భాగమని టిక్‌టాక్ (ఇండియాలో నిషేధం)  తెలిపింది. ఆ నిబంధనలను ఉల్లంఘించే 99శాతం కంటే ఎక్కువ కంటెంట్‌ను తాము తొలగిస్తున్నట్లు కూడా పేర్కొంది. సోషల్ మీడియా వల్ల పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు, ఏకాగ్రత పూర్తిగా నశిస్తున్నాయని ఉదాహరణలతో చెప్పారు.

24 గంటలూ ఓ కన్నేసి ఉంచడం సాధ్యమా?
పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని 24 గంటలూ గమనించడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని పెద్ద కుటుంబాల అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. పిల్లలు ఇంటర్నెట్‌లోని ట్యుటోరియల్స్ చూసి తల్లిదండ్రులు పెట్టే ఫిల్టర్లను లేదా సమయ పరిమితులను సులభంగా దాటేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి 20 లక్షలు : ఎలా?

నిపుణులేమంటున్నారు? 
సోషల్ మీడియాలో వచ్చే ప్రతి 'లైక్' లేదా 'నోటిఫికేషన్' మెదడులో డోపమైన్ (Dopamine) అనే రసాయనాన్ని విడుదల చేస్తుందని, ఇది స్లాట్ మెషీన్ల (జూదం) లాగా పిల్లలను వ్యసనపరులుగా మారుస్తుందని నిపుణులు కోర్టుకు తెలిపారు. అతిగా సోషల్ మీడియా వాడటం వల్ల టీనేజర్ల మెదడు అభివృద్ధి దెబ్బతింటుందని, నిద్రలేమి,మానసిక సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా హెచ్చరిస్తోంది.

ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌ వార్నింగ్‌

మరో కోణం
అయితే కొంతమంది సైకాలజిస్టులు కేవలం సోషల్ మీడియాని మాత్రమే బ్లేమ్ చేయలేమని, పిల్లలపై మితిమీరిన నియంత్రణ కంటే వారితో మాట్లాడటం, వారిని నమ్మడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: అఫ్గాన్‌లో సోలో ట్రిప్‌, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్‌ నటుడు కూడా!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement