ఓర్హాన్ అవత్రామణి (Orhan Awatramani) అలియాస్ ఓర్రీ (Orry) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, బాలీవుడ్ స్టార్స్‌కు అత్యంత సన్నిహితుడిగా సుపరిచితుడు. బిజినెస్, సినిమా ఇలా ఎక్కడ ఏ సెలబ్రిటీ పార్టీ జరిగినా అక్కడ ఓర్రీ వాలిపోవాల్సిందే. అంతేకాదు స్టార్ హీరోయిన్లు, మొదలు, స్టార్ కిడ్స్‌దాకా క్రేజీ పోజులిస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాడు. తాజాగా ఓర్రీ తెగ హల్ చల్ చేస్తున్నాడు. ఎలాంటి ఉద్యోగం లేకుండా ఆయనకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఏం పని చేస్తాడు?
ప్రతి సెలబ్రిటీ పార్టీలో కనిపించడం, స్టార్స్‌తో కలిసి వెకేషన్స్ వెళ్లడం, సోషల్ మీడియా ఫీడ్‌లో హల్‌చల్ చేయడం ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, కేవలం సెలబ్రిటీలతో ఉన్న పరిచయాలు, వినూత్నమైన ఫ్యాషన్ సెన్స్, పార్టీలతో ఇంటర్నెట్ సంచలనంగా నిలుస్తుంటాడు. ఇటీవల కావ్య కర్నాటక్ హోస్ట్ చేసిన 'లెర్న్ బై కేకే క్రియేట్' (Learn by KK Create) పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఓర్రీ తన సంపాదనా రహస్యాలను పంచుకున్నాడు. ముఖ్యంగా తన పర్సనల్ బ్రాండ్, ఆన్‌లైన్ క్రేజ్‌ను ఒక లాభదాయకమైన వ్యాపారంగా ఎలా మార్చుకున్నాడో వివరించారు. దీంతో ఈ విషయాలు తెగ వైరల్‌గా మారాయి.
ఒక్క డీల్‌తో రూ. 76 లక్షలు
తన ఆదాయం గురించి ఓర్రీ మాట్లాడుతూ.. తన సంపాదనలో ఎక్కువ భాగం బ్రాండ్ కొల్లాబొరేషన్స్ (Brand Collaborations) , పెయిడ్ అప్పియరెన్స్ (డబ్బులు తీసుకుని ఈవెంట్స్‌కు వెళ్లడం) ద్వారా వస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా గత నెలలో నేను కేవలం ఒకే ఒక్క డీల్, అంటే ఒకే ఒక్క రీల్ (Reel) ద్వారా రూ. 76 లక్షలు సంపాదించాను అని చెప్పుకొచ్చాడు. దీంతో ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కోసం బ్రాండ్స్ ఇంత చెల్లిస్తున్నాయా అని నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కొంతమంది ఈ నెంబర్ చూసి షాక్ అవుతుంటే, మరికొందరు మాత్రం తనకున్న క్రేజ్‌ను బిజినెస్‌గా మార్చుకున్న ఓర్రీ తెలివిని అభినందిస్తున్నారు.
అలాగే ఓర్రీ వ్యాపారం కేవలం సోషల్ మీడియా ప్రమోషన్లకే పరిమితం కాలేదు. ప్రైవేట్ ఈవెంట్స్‌కు వెళితే రూ. 15 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు వసూలు చేస్తాడట. ఇందులో లంచ్‌లు, డిన్నర్‌లు, బర్త్‌డే పార్టీలు, పెళ్లిళ్లు మరియు ఇతర ఫంక్షన్లు ఉంటాయి.
"రూ. 15-రూ. 25 లక్షలు ఇస్తే, మీరు నన్ను లంచ్‌కి లేదా డిన్నర్‌కి పిలవొచ్చు. మీ పెళ్లికి లేదా బర్త్‌డేకి వస్తాను. మనం చిన్నప్పటి స్నేహితులం అన్నట్లుగా అక్కడ స్పీచ్ ఇస్తాను. మీతో కలిసి తిరుగుతాను, మీ పేరెంట్స్‌తో కలిసి షాట్స్ వేస్తాను. మీరు ఎవరిని కలవమంటే వారిని కలుస్తాను. ఇదొక ఎక్స్‌పీరియన్స్, దీన్ని మీరు డబ్బులతో కొనవచ్చు" అంటూ ఛలోక్తులు విసిరాడు. ఈవెంట్స్‌కు వెళ్ళడమే కాకుండా, అక్కడ ఉన్న అతిథులతో మాట్లాడటం, ఫోటోలకు ఫొజులివ్వడం , తన ఫేమస్ 'సిగ్నేచర్ పోజ్' ఇవ్వడం వంటివి కూడా చేస్తారు.
ఇదీ చదవండి: అఫ్గాన్‌లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా!
పర్సనల్ బ్రాండింగ్ పవర్
అటెన్షన్ అనేది ఒక విలువైన వస్తువుగా మారిన ఈ రోజుల్లో, ఒక వ్యక్తిని కూడా ఒక సర్వీస్ లాగా మార్కెట్ చేయవచ్చని నిరూపిండంలో ఓర్రీ ఆరితేరిపోయాడు. ప్రస్తుత కాలంలో 'క్రియేటర్ ఎకానమీ' (Creator Economy) వల్ల ఫేమ్‌ను క్యాష్ చేసుకునే విధానం పూర్తిగా మారిపోయిందని ఓర్రీ అభిప్రాయపడ్డారు. తన సిగ్నేచర్ పోజ్ పాపులారిటీ గురించి జోక్ చేస్తూ..హిందుస్తాన్‌లో కేవలం ఇద్దరి పోజులు మాత్రమే ఫేమస్ - ఒకటి షారూఖ్ ఖాన్, రెండు ఓర్రీ అన్నంత స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నాడు. డబ్బును ఎవరు మేనేజ్ చేస్తారు అని ప్రశ్నించినపుడు సింపుల్‌గా అమ్మానాన్ని అని సమాధానమివ్వడం విశేషం. భవిష్యత్తులో ఆ విషయంలో తల్లిదండ్రులకే బాధ్యత వదిలేస్తాను అని కూడా చెప్పాడు.


