రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌ వార్నింగ్‌ | IIT Madras Director Warns NEET UG 2026 Candidates Against Telegram Paper Leak Scams, Urges Caution And Official Updates Only | Sakshi
Sakshi News home page

రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌ వార్నింగ్‌

Jun 17 2026 12:12 PM | Updated on Jun 17 2026 12:46 PM

NEET UG 2026 re-exam IIT Madras Director Flags Rs 10 Lakh Scam

నీట్ యూజీ (NEET UG-2026 రీ-ఎగ్జామ్‌కు సమయం సమీపిస్తున్న వేళ, పేపర్ల లీక్‌పై  పలు వార్తలు హల్‌చల్‌ చేస్తూనే ఉన్నాయి. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం టెలిగ్రామ్‌పై తాత్కాలికంగా నిషేధం విధించినంత మాత్రాన సరిపోతుందా? మిగిలిన  యాప్‌లను ఎలా నియంత్రిస్తారు? అంటూ పరీక్ష వ్యవస్థపై, భద్రతపై అనేక సందేహాలు, విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరీక్షకు ముందే క్వశ్చన్ పేపర్లు ఇస్తామంటూ ఆన్‌లైన్‌లో జరుగుతున్న మోసాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి హెచ్చరించారు. నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ఆయన స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో పంచుకున్నఒక వీడియో సందేశంలో, జూన్ 21న జరగబోయే రీ-ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయంటూ టెలిగ్రామ్ (Telegram) ఛానెళ్లలో వస్తున్న ప్రకటనలను నమ్మవద్దని ఆయన కోరారు. పరీక్ష ఒత్తిడిలో ఉన్న విద్యార్థులే టార్గెట్‌గా, అబద్ధపు వాగ్దానాలతో ఈ కేటుగాళ్లు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

రూ. 14 వేల నుండి రూ. 10 లక్షల దాకా
కొన్ని టెలిగ్రామ్ ఛానెళ్లు లీకైన పేపర్లు ఇస్తామంటూ విద్యార్థుల నుండి రూ. 14వేల  రూ. 25వేలవరకు డిమాండ్ చేస్తున్నాయని కామకోటి తెలిపారు. మరికొన్ని కేసుల్లో ఏకంగా రూ. 10 లక్షల వరకు కూడా డిమాండ్ చేసినట్లు రిపోర్టులు వచ్చాయన్నారు.

టెలిగ్రామ్ ఛానెళ్లలో పేపర్ లీక్ అయినట్లు చూపే స్క్రీన్‌షాట్లు, వీడియోలు ఎలా సృష్టిస్తారో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వివరించారు. ఛానెల్ అడ్మిన్లు పాత మెసేజ్‌లను ఎడిట్ చేసి, ఒరిజినల్ డేట్ (పాత తేదీ) మారకుండానే అందులో కొత్త కంటెంట్‌ను పెట్టగలరు.
దీనివల్ల పరీక్షకు ముందే పేపర్ షేర్ చేసినట్లు తప్పుగా కనిపిస్తుంది.

జూన్ 21న పరీక్ష ముగిసిన తర్వాత కూడా ఇలాంటి ఎడిట్ చేసిన స్క్రీన్‌షాట్లు, తప్పుడు పోస్టులు మళ్లీ వచ్చే అవకాశం ఉందని, కాబట్టి వాటిని ఫార్వార్డ్ చేయవద్దని, ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ఆయన హెచ్చరించారు. ఒక్కసారి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే, వాటిని తిరిగి రాబట్టడం అసాధ్యమని కామకోటి చెప్పారు. అలాగే అపరిచిత వ్యక్తులతో అడ్మిట్ కార్డ్‌లు (Admit Cards), ఫోన్ నంబర్లు లాంటి వ్యక్తిగత వివరాలను షేర్‌ చేయొద్దని స్కామర్లు దీన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

ఇదీ చదవండి: ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి 20 లక్షలు : ఎలా?

విద్యార్థులు కేవలం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్ , ఛానెళ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి. ఫేక్‌ మెసేజ్‌లు, ఫార్వార్డ్‌ మెసేజ్‌ల పట్ల అప్రతమత్తంగా ఉండాలన్నారు.  ఒకవేళ ఇలాంటి సైబర్ మోసాలు లేదా అనుమానాస్పద మెసేజ్‌లు కనిపిస్తే, వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇదీ చదవండి: అఫ్గాన్‌లో సోలో ట్రిప్‌, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్‌ నటుడు కూడా!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement