అయోధ్య విరాళాల వివాదం.. పప్పుయాదవ్‌పై దాడి | pappu yadav attack delhi press conference chappal thrown | Sakshi
Sakshi News home page

అయోధ్య విరాళాల వివాదం.. పప్పుయాదవ్‌పై దాడి

Aug 2 2026 8:23 PM | Updated on Aug 2 2026 9:27 PM

pappu yadav attack delhi press conference chappal thrown

సాక్షి, ఢిల్లీ: ఎంపీ పప్పూ యాదవ్‌పై దాడి జరిగింది. ఈరోజు ఆదివారం ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహిస్తూఉండగా ఓ వ్యక్తి అతనిపై చెప్పు విసిరారు. అనంతరం ఎంపీపై దాడికి యత్నించగా మద్ధతుదారులు అతనిని పట్టుకొని చితకబాదారు.అనంతరం అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల అయోధ్య రామమందిర హుండీ చోరి విషయంలో ఇటీవల ప్రతిపక్షాలు పార్లమెంటు ఎదుట నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా పప్పుయాదవ్ సన్యాసి వేశం వేసి హూండీ పట్టుకొని నాటకం వేశారు. కాగా ఈ నాటకం హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఉందంటూ వారణాసిలోని కొందరు సన్యాసులు, లాయర్లు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.ఆ నేపథ్యంలోనే లక్నోలోని ఓ హిందూ నాయకుడు పప్పూయాదవ్‌  తల తెచ్చిన వారికి రూ. 51 లక్షల రివార్డును ఇస్తానని ప్రకటించారు.

ఇంతలోనే ఈ రోజు ఆయనపై దాడి జరిగింది. దాడి అనంతరం పప్పు యాదవ్ మాట్లాడుతూ "కొంతమంది బాబాలు ప్రతిరోజూ, "నన్ను చంపండి, కాల్చండి, నేను మీకు రూ. 51 లక్షలు ఇస్తాను. అంటున్నారు. అసలు నాతప్పేమిటి ఈ దాడి మీ కళ్ల ముందే జరిగింది. అసలు నేరం బ్రిజ్‌భూషణ్ తివారీ, చంపత్ రాయ్‌లది" అని అన్నారు.

అయితే దాడి తర్వాత అక్కడ ఉద్రిక్తకర పరిస్తితులు ఏర్పడ్డాయి. ఎంపీ మద్దతుదారులు అతనిపై తీవ్రస్థాయిలో దాడికి యత్నించారు. దీంతో పోలీసులు అతి కష్టంమీద దాడి చేసిన వ్యక్తిని అక్కడి నుండి తరలించారు. కాగా నిందితుడు తనపై దాడికి కత్తి తీసుకవచ్చాడని పప్పూ యాదవ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement