దీపావళి పండగ వేళ ‘లక్ష్మి’.. కునాల్ కపూర్ కాంబో.. ‘దివాళి డిలైట్స్’ సీజన్ 2 | Bigger Better Ever Laxmi Chef Kunal Kapur Return Diwali Delights Season 2 | Sakshi
Sakshi News home page

దీపావళి పండగ వేళ ‘లక్ష్మి’.. కునాల్ కపూర్ కాంబో.. ‘దివాళి డిలైట్స్’ సీజన్ 2

Oct 1 2026 2:48 PM | Updated on Oct 1 2026 3:27 PM

Bigger Better Ever Laxmi Chef Kunal Kapur Return Diwali Delights Season 2

దీపావళి పండుగ దగ్గరపడుతుండటంతో ఉత్తర అమెరికా అంతటా ఉన్న వంటగదులు రుచికరమైన వంటకాలు, కుటుంబ సభ్యుల కలయిక, ఆత్మీయతల వేడుకకు సిద్ధమవుతున్నాయి. ఈ సంవత్సరం ‘లక్ష్మి’ (Laxmi) బ్రాండ్ ఈ సంబరాలను మరింత ఉత్సాహభరితంగా మారుస్తోంది.

వరుసగా రెండో సంవత్సరం, లక్ష్మి ప్రముఖ షెఫ్, ఎన్డీటీవీ ఫుడ్ అవార్డు గ్రహీత షెఫ్ కునాల్ కపూర్‌తో కలిసి ‘దీపావళి డిలైట్స్ విత్ లక్ష్మి ఫీచరింగ్ షెఫ్ కునాల్ కపూర్’ (Diwali Delights with Laxmi featuring Chef Kunal Kapur)

అనే ప్రత్యేకమైన 6 భాగాల యూట్యూబ్ సిరీస్‌ను అందుబాటులోకి తెస్తోంది. లక్ష్మి క్వాలిటీ ఉత్పత్తులతో సులభంగా, రుచికరంగా చేసే ఫ్యూజన్ వంటకాల ద్వారా ఈ సిరీస్ దీపావళి ఆనందాన్ని ఇళ్లలోకి తీసుకువస్తుంది.

గతేడాది సిరీస్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని సాంప్రదాయ దీపావళి రుచులకు ఆధునిక హంగులను జోడిస్తూ సులువైన వంటకాలతో షెఫ్ కునాల్ కపూర్ మళ్లీ ముందుకు వచ్చారు. ప్రతీ ఎపిసోడ్ సాధారణ గృహ వంటగదులకు తగినట్లుగా రూపొందించబడింది. బిజీగా ఉండే కుటుంబాలు సులభంగా చేసుకునేలా, ప్రతీ పండుగ విందును ప్రత్యేకంగా మార్చేంత రుచికరంగా ఇవి ఉంటాయి.

సెప్టెంబర్ 9న మొదటి ఎపిసోడ్ ప్రీమియర్ అయింది. దీనితో వంటలు చేయడం, పండుగ జరుపుకోవడం, కొత్త దీపావళి జ్ఞాపకాలను నెమరువేసుకునే పండుగ సీజన్ ప్రారంభమైంది.

‘రెండవ సంవత్సరం కూడా లక్ష్మి బ్రాండ్‌తో భాగస్వామ్యం కావడం నిజంగా చాలా ప్రత్యేకమైనది’ అని షెఫ్ కునాల్ కపూర్ అన్నారు. ‘దీపావళి అంటే అందరూ కలిసి రావడం, సంప్రదాయాలను జరుపుకోవడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం. లక్ష్మి ప్రామాణికమైన ఉత్పత్తులతో మేము ఆ పండుగ స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలకు సులభమైన, సృజనాత్మకమైన, ఆనందదాయకమైన రీతిలో అందిస్తున్నాము. ఎందుకంటే క్వాలిటీ, సంప్రదాయంతో పండుగ జరుపుకోవాల్సి వస్తే... లక్ష్మి ఉందిగా!’ అని కునాల్ కపూర్ అన్నారు.

అయితే ఈ సంబరాలు కేవలం వంటగదికే పరిమితం కావడం లేదు.

ఈ దీపావళికి ఒక లగ్జరీ కారు మీ సొంతం కావచ్చు! గత సంవత్సరం న్యూజెర్సీకి చెందిన శ్రీ ఉదయ్ కుమార్ గ్రాండ్ ప్రైజ్ గెలుచుకుని కారును సొంతం చేసుకున్నారు.

 

 

ఈ సంవత్సరం, లక్ష్మి అమెరికా అంతటా ఉన్న కుటుంబాలకు ఈ పోటీలో పాల్గొనడానికి మరింత పెద్ద కారణాన్ని అందిస్తోంది. ‘డ్రీమ్ బిగ్, విన్ బిగ్గర్ దిస్ ఫెస్టివల్!’ (Dream Big, Win Bigger This Festival!) దీపావళి స్వీప్‌స్టేక్స్ ద్వారా మీరు లగ్జరీ కారు, బంగారు నాణాలు, స్మార్ట్‌ఫోన్లు, టీవీలు మరెన్నో ఉత్తేజకరమైన బహుమతులు గెలుచుకునే తదుపరి అదృష్ట విజేత కావచ్చు!

https://laxmihos.com/dream-big-win-bigger-this-festival/

మీరు చేయాల్సిందల్లా ఒక లక్ష్మి ఉత్పత్తిని కొనుగోలు చేసి ఈ స్వీప్‌స్టేక్స్‌లో నమోదు చేసుకోవడమే. ఎందుకంటే ఈ దీపావళికి, తదుపరి పెద్ద విజేత మీరు కావచ్చు!

కాబట్టి మీరు పండుగ విందును సిద్ధం చేస్తున్నా, షెఫ్ కునాల్ కొత్త వంటకాన్ని ప్రయత్నిస్తున్నా లేదా దీపావళి కోసం మీకిష్టమైన లక్ష్మి ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నా ఈ పండుగ సీజన్‌లో ఆనందించడానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి.

‘గత సంవత్సరం సాధించిన విజయాన్ని పునాదిగా చేసుకుని షెఫ్ కునాల్ కపూర్‌తో మళ్లీ భాగస్వామ్యం కావడం, ఈ గివ్అవే (Giveaway) ఆఫర్‌ను మళ్లీ తీసుకురావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది’ అని లక్ష్మి టీమ్ పేర్కొంది. ‘ఉత్తర అమెరికా అంతటా జరిగే దీపావళి వేడుకలకు లక్ష్మి క్వాలిటీ ఉత్పత్తులతో చేసిన రుచికరమైన ఇండియన్ ఫ్యూజన్ వంటకాల ద్వారా ఆనందాన్ని పంచడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం’ అని హెచ్‌ఓఎస్‌ గ్లోబల్ ఫుడ్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సుహాసిని పాటిల్ చెప్పారు.  

ఐదు దశాబ్దాలకు పైగా లక్ష్మి బ్రాండ్ ఉత్తర అమెరికాలోని ఇళ్లకు ప్రామాణికమైన దక్షిణాసియా రుచులను, సంప్రదాయాలను అందిస్తోంది. 1972లో స్థాపించబడిన లక్ష్మి ప్రతి భోజన బల్లపై ఇంటి రుచిని అందించే నాణ్యమైన ఉత్పత్తులు, ప్రామాణికమైన దినుసులకు నమ్మకమైన పేరుగా నిలిచింది.

ఈ దీపావళికి, లక్ష్మి, షెఫ్ కునాల్ కపూర్ కుటుంబాలన్నింటినీ కలసి వంటలు చేయాలని, వేడుకలు జరుపుకోవాలని, సంతోషాన్ని పంచుకోవాలని, పెద్ద కలలు కనాలని ఆహ్వానిస్తున్నారు.. ఎందుకంటే ‘లక్ష్మి ఉందిగా!’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement