ఇంటి పెయింటింగ్‌లో కొత్త ట్రెండ్.. టెన్షన్ లేకుండా కొత్త లుక్! | Asian Paints Beautiful Homes Painting Services | Sakshi
Sakshi News home page

ఇంటి పెయింటింగ్‌లో కొత్త ట్రెండ్.. టెన్షన్ లేకుండా కొత్త లుక్!

Aug 21 2026 12:08 PM | Updated on Aug 21 2026 12:11 PM

Asian Paints Beautiful Homes Painting Services

ఇంటికి పెయింటింగ్ వేయించడం అంటే.. గోడలకు రంగులు మార్చడం మాత్రమే కాదు. ముందుగా ఏ రంగులు వేయాలి?, ఎలాంటి పెయింట్ ఎంచుకోవాలి?, మంచి పెయింటర్లు ఎక్కడ దొరుకుతారు?, పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది?, పెయింటింగ్ సమయంలో ఇంట్లోని వస్తువులను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి?,.. ఇలా చాలా విషయాలను ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే.. చాలామందికి ఇంటి పెయింటింగ్ అనగానే ఒక రకమైన టెన్షన్ మొదలవుతుంది.

అలాంటి ఇబ్బందులను తొలగించేందుకు 'ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ పెయింటింగ్ సర్వీస్' (BHPS) అందుబాటులో ఉంది. ఇంటికి పెయింటింగ్ వేసే ప్రక్రియ ప్రారంభం నుంచి.. చివరి వరకు చూసుకునేలా కంపెనీ ఈ సేవను రూపొందించింది. అంటే రంగుల ఎంపిక నుంచి పెయింటింగ్ పూర్తయ్యే వరకు నిపుణుల సహాయం అందుతుందన్నమాట.

ఏఐ కలర్ విజువలైజేషన్
ఇంటికి పెయింట్ వేయించేటప్పుడు రంగుల ఎంపికే పెద్ద సమస్యగా ఉంటుంది. షోరూమ్‌లో చూసిన రంగు ఇంటి గోడలపై ఎలా కనిపిస్తుందో ముందుగా చెప్పడం కష్టం. ఇలాంటి సమయంలో BHPSలో అందించే 'ఏఐ కలర్ విజువలైజేషన్' ఉపయోగపడుతుంది.

ఇక్కడ మీ ఇంటికి ఏ రంగు వేస్తే ఎలా కనిపిస్తుందో.. ముందుగానే ఊహించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల రంగు ఎంపిక విషయంలో గందరగోళం తగ్గుతుంది. అంతే కాకుండా.. నిపుణుల కలర్ కన్సల్టేషన్ ద్వారా మీ ఇంటి గదులు, లైటింగ్, ఫర్నిచర్ వంటి అంశాలను బట్టి రంగులను ఎంచుకోవడంలో సహాయం పొందవచ్చు.

పెయింట్ ఎంపిక.. నిపుణుల సలహా
ప్రతి గదికి ఒకే రకమైన పెయింట్ సరిపోదు. ఇంటి లోపలి గోడలకు, బయట గోడలకు వేర్వేరు అవసరాలు ఉంటాయి. అలాగే వంటగది, బెడ్‌రూమ్, లివింగ్ రూమ్ వంటి ప్రాంతాలను బట్టి కూడా పెయింట్ ఎంపిక మారవచ్చు. BHPSలో నిపుణులు ఇంటి అవసరాలను బట్టి సరైన పెయింట్ ఉత్పత్తులను ఎంచుకోవడంలో సూచనలు ఇస్తారు. దీంతో ఏ పెయింట్ కొనాలి అనే విషయంలో మనం పూర్తిగా అయోమయానికి గురికావాల్సిన అవసరం ఉండదు.

డేడికేటెడ్ సూపర్‌వైజర్
పెయింటింగ్ మొదలైన తర్వాత అసలు టెన్షన్ మొదలవుతుంది. పెయింటర్లు సరిగ్గా పని చేస్తున్నారా? సమయానికి వస్తున్నారా? పని సరిగ్గా జరుగుతోందా? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇలా ప్రతి విషయాన్ని మనమే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ.. BHPSలో డేడికేటెడ్ సూపర్‌వైజర్ ఉండటం వల్ల ఈ బాధ్యత తగ్గుతుంది.

సమయానికి పెయింటింగ్ పూర్తి చేయడం
పెయింటింగ్ పనులు ఎక్కువ రోజులు కొనసాగితే ఇంట్లో ఉండేవారికి ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబం అదే ఇంట్లో ఉంటున్నప్పుడు రోజూ పెయింటింగ్ పనులు జరుగుతుండటం అసౌకర్యంగా మారవచ్చు. అందుకే BHPSలో ఆన్ టైమ్ పెయింటింగ్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముందుగా నిర్ణయించిన టైమ్‌లైన్ ప్రకారం.. పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. దీంతో పెయింటింగ్ పని ఎప్పుడు పూర్తవుతుందో కూడా ఒక క్లారిటీ ఉంటుంది.

మొత్తం పనికి ఒకటే సర్వీస్
BHPSలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పెయింటింగ్ కోసం వేర్వేరు వ్యక్తులను వెతుక్కోవాల్సిన అవసరం తగ్గుతుంది. కలర్ కన్సల్టేషన్, పెయింట్ ఎంపిక, నిపుణుల పెయింటింగ్, సూపర్‌విజన్, ప్రాజెక్ట్ పూర్తి చేయడం వంటి అంశాలను ఒకే సేవలో పొందేలా ఈ సర్వీస్ రూపొందించారు.

20% డబ్బు వాపసు హామీ
ఈ సేవలో 20 శాతం డబ్బు వాపసు (20% Money-Back Guarantee) అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. ఇలాంటి హామీ ఉండటం వల్ల వినియోగదారులకు సేవపై మరింత నమ్మకం కలుగుతుంది.

ఇంటి పెయింటింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే 80504 80504 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement