మిలియన్లు కురిపించిన పెయింటింగ్‌.. కొన్నది 30 డాలర్లకే! | Painting Bought for 30 Sells for Record 1.35 Million Auction | Sakshi
Sakshi News home page

మిలియన్లు కురిపించిన పెయింటింగ్‌.. కొన్నది 30 డాలర్లకే!

Oct 5 2026 2:48 AM | Updated on Oct 5 2026 2:53 AM

Painting Bought for 30 Sells for Record 1.35 Million Auction

పాతకాలపు వస్తువులు, పెయింటింగ్‌లు సేకరించడం కొంతమందికి అలవాటుగా ఉంటుంది. ఆ అలవాటే ఒకతన్ని అదృష్టవంతున్ని చేసింది. కేవలం 30 డాలర్లకు కొన్న ఓ పెయింటింగ్‌ ఏకంగా ఒక మిలియన్‌ డాలర్లకు పైగా తెచ్చిపెట్టింది.

పాతకాలపు వస్తువులు, వినైల్‌ రికార్డులు, ఫర్నిచర్‌ కోసం ఓ ఎస్టేట్‌ సేల్‌కు వెళ్లిన వ్యక్తికి అక్కడ ఊహించని అదృష్టం తలుపుతట్టింది. చీకటి మూలన కనిపించిన చిన్న పెయింటింగ్‌ను కేవలం 30 డాలర్లకు (సుమారు రూ.2,800) కొనుగోలు చేశాడు. అయితే ఆ చిత్రంపై ఉన్న ఓ చిన్న సంతకం అతడి దృష్టిని ఆకర్షించింది. అదే చివరకు ఆ పెయింటింగ్‌ను అంతర్జాతీయ ఆర్ట్‌ వేలంలో 1,352,600 డాలర్ల (సుమారు రూ.13 కోట్లు) విలువైన అరుదైన కళాఖండంగా మార్చింది.

కలామజూ, మిచిగాన్‌లో జరిగిన ఎస్టేట్‌ సేల్‌లో ఈ వ్యక్తికి 8×11 అంగుళాల పరిమాణంలో ఉన్న చిన్న పెయింటింగ్‌ కనిపించింది. స్లేట్‌-గ్రే రంగు ఉపరితలంపై సముద్రపు పెంకులను చిత్రించిన ఈ కళాఖండం పెద్దగా ప్రత్యేకంగా కనిపించలేదు. అయితే దిగువ ఎడమ మూలలో “Abercrombie ’51” అనే సంతకం కనిపించింది. పెయింటింగ్‌పై పేరు ఉండటం మాత్రమే దాని అసలుదనానికి ఆధారం కాదని తెలిసిన ఆ వ్యక్తి దానిని కొనుగోలు చేసిన తర్వాత తీవ్రంగా పరిశోధించి దాని అసలు కథను తెలుసుకున్నారు.

వైద్య సేవలకు బదులుగా ఇచ్చిన పెయింటింగ్‌

ఈ కళాఖండం వెనుక ఆసక్తికరమైన చరిత్రే ఉంది. 1952లో అబెర్‌క్రోంబీ ఈ పెయింటింగ్‌ను మిచిగాన్‌లోని కలామజూకు చెందిన డాక్టర్‌ జాన్‌ రేనాల్డ్స్‌ కు వైద్య సేవలకు ప్రతిఫలంగా ఇచ్చినట్లు వేలం సంస్థ తెలిపింది. ఆ తర్వాత దాదాపు 75 ఏళ్ల పాటు అది రేనాల్డ్స్‌ కుటుంబం వద్దే ఉండిపోయింది. 1952, 1953లో అబెర్‌క్రోంబీ నిర్వహించిన ఆరు సోలో ప్రదర్శనల్లో ఈ పెయింటింగ్‌ను ప్రదర్శించారు. ఆ తర్వాత ప్రజల దృష్టికి పూర్తిగా దూరమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement