ఫండే
దశాబ్దాలుగా ఓ కుటుంబం దగ్గరే ఉన్న పెయింటింగ్.. వేలంలో కళ్లు చెదిరే ధరకు అమ్ముడైంది! ఒకప్పుడు డాక్టర్‌కు బహుమతిగా ఇచ్చిన ఆ చిత్రానికి ఇప్పుడు ఏకంగా 1.35 మిలియన్ డాలర్లు పలికాయి! అసలు ఈ పెయింటింగ్ కథేంటి? ఇంత భారీ ధర పలకడానికి కారణమేంటి? ఇప్పుడు చూద్దాం!
దశాబ్దాల నాటి కళాఖండం కళ్లు చెదిరే ధరకు అమ్ముడైంది. ఫొటోలో కనిపిస్తున్న ఈ చిత్రం అమెరికన్ చిత్రకారిణి గెయిర్‌టూడ్ అబర్‌క్రోంబీ 1951లో చిత్రించినది. ఆమెకు 1952లో జబ్బు చేసినప్పుడు మిషిగన్‌లోని కలమజూకు చెందిన డాక్టర్ జాన్ రేనాల్డ్స్ చికిత్స చేశారు. అప్పట్లో అబర్‌క్రోంబీ తాను గీసిన ఈ చిత్రాన్ని రేనాల్డ్స్‌కు బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి దాదాపు ఏడున్నర దశాబ్దాల కాలం ఈ చిత్రం రేనాల్డ్స్ కుటుంబ సభ్యుల వద్దనే ఉంది.
రేనాల్డ్స్ కుటుంబం కొద్ది నెలల కిందట మిషిగన్ ఎస్టేట్‌ను అమ్మేసినప్పుడు ఎస్టేట్‌లోని వస్తువులతో పాటు ఈ పెయింటింగ్‌ను కూడా అమ్మేశారు. ఒక ఔత్సాహికుడు దీనిని 30 డాలర్లకు కొనుగోలు చేశారు. అతడి వద్ద నుంచి ఇది షికాగోలోని ‘ఫ్రీమన్స్ ఆక్షన్’ వేలంశాలకు చేరింది. ఇటీవల ‘ఫ్రీమన్స్ ఆక్షన్’ నిర్వహించిన కళాఖండాల వేలంపాటలో ఈ చిత్రానికి ఏకంగా 1.35 మిలియన్ డాలర్ల ధర పలికింది. పురాతన కళాఖండాల సేకర్త ఒకరు దీనిని ఆ ధర చెల్లించి సొంతం చేసుకున్నారు.
ఇదీ చదవండి: ఎడారిలోన పూలు పూచె... ఎంత సందడి!


