ఎడారిలోన పూలు పూచె... ఎంత సందడి! | the Desert Trees And Plants in Chiles Atacama Desert | Sakshi
Sakshi News home page

ఎడారిలోన పూలు పూచె... ఎంత సందడి!

Oct 25 2026 12:33 PM | Updated on Oct 25 2026 12:55 PM

 the Desert Trees And Plants in Chiles Atacama Desert

ప్రపంచంలోనే అత్యంత పొడిప్రదేశం– చిలీలోని అటకామా ఎడారి. అటకామా ఎడారిలో గడ్డిపరకలు మొలవడమే గగనం. అలాంటిది ఈసారి ఆ ఎడారిలో ఏకంగా పూలు పూశాయి. పూలతో కళకళలాడుతున్న అటకామా ఎడారి ఇప్పుడు అంతర్జాతీయంగా వార్తలకెక్కింది. ఎడారిలో పూలు పూయడమంటే వింతల్లోకెల్లా వింత. ఈ వింతకు కారణం ఏమై ఉంటుందని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, ‘ఇదంతా సూపర్‌ ఎల్‌ నినో ప్రభావమే’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

సూపర్‌ ఎల్‌ నినో దెబ్బకు ప్రపంచంలో చాలాచోట్ల సాగుభూములు బీడుభూములుగా మారిన పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు అటకామా ఎడారిలో ఏకంగా దాదాపు రెండు వందల వృక్షజాతులకు చెందిన మొక్కలు మొలిచి, అవి పూలతో కళకళలాడుతూ సందర్శకులకు వింత గొలుపుతున్నాయి. ‘సూపర్‌ ఎల్‌నినో’ ప్రభావం వల్ల ఈసారి అటకామా ఎడారిలో 15 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆ కాసిన్ని చినుకుల ఫలితమే ఎడారిలో ఈ అనూహ్య పుష్పవిలాసం.

ఇదీ చదవండి: భారీ బంగారు ఝంకాలు..ఏకంగా 5,840 గంటలు, 55 మంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement