breaking news
art auction
-
ఓ పాత పెయింటింగ్.. వేలంలో దీని ధర ఎన్ని కోట్లంటే?
దశాబ్దాలుగా ఓ కుటుంబం దగ్గరే ఉన్న పెయింటింగ్.. వేలంలో కళ్లు చెదిరే ధరకు అమ్ముడైంది! ఒకప్పుడు డాక్టర్‌కు బహుమతిగా ఇచ్చిన ఆ చిత్రానికి ఇప్పుడు ఏకంగా 1.35 మిలియన్ డాలర్లు పలికాయి! అసలు ఈ పెయింటింగ్ కథేంటి? ఇంత భారీ ధర పలకడానికి కారణమేంటి? ఇప్పుడు చూద్దాం!దశాబ్దాల నాటి కళాఖండం కళ్లు చెదిరే ధరకు అమ్ముడైంది. ఫొటోలో కనిపిస్తున్న ఈ చిత్రం అమెరికన్ చిత్రకారిణి గెయిర్టూడ్ అబర్క్రోంబీ 1951లో చిత్రించినది. ఆమెకు 1952లో జబ్బు చేసినప్పుడు మిషిగన్‌లోని కలమజూకు చెందిన డాక్టర్ జాన్ రేనాల్డ్స్ చికిత్స చేశారు. అప్పట్లో అబర్క్రోంబీ తాను గీసిన ఈ చిత్రాన్ని రేనాల్డ్స్కు బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి దాదాపు ఏడున్నర దశాబ్దాల కాలం ఈ చిత్రం రేనాల్డ్స్ కుటుంబ సభ్యుల వద్దనే ఉంది.రేనాల్డ్స్ కుటుంబం కొద్ది నెలల కిందట మిషిగన్ ఎస్టేట్‌ను అమ్మేసినప్పుడు ఎస్టేట్‌లోని వస్తువులతో పాటు ఈ పెయింటింగ్‌ను కూడా అమ్మేశారు. ఒక ఔత్సాహికుడు దీనిని 30 డాలర్లకు కొనుగోలు చేశారు. అతడి వద్ద నుంచి ఇది షికాగోలోని ‘ఫ్రీమన్స్ ఆక్షన్’ వేలంశాలకు చేరింది. ఇటీవల ‘ఫ్రీమన్స్ ఆక్షన్’ నిర్వహించిన కళాఖండాల వేలంపాటలో ఈ చిత్రానికి ఏకంగా 1.35 మిలియన్ డాలర్ల ధర పలికింది. పురాతన కళాఖండాల సేకర్త ఒకరు దీనిని ఆ ధర చెల్లించి సొంతం చేసుకున్నారు.ఇదీ చదవండి: ఎడారిలోన పూలు పూచె... ఎంత సందడి! -
గతంలో రూ. వెయ్యి.. ఇప్పుడు 19.19 కోట్లు!
ఇది ఐదు దశాబ్దాల కిందటి మాట. ప్రముఖ చిత్రకారుడు అక్బర్ పదంసీ కుంచె నుంచి జాలువారిన 'గ్రీకు ల్యాండ్‌స్కేప్' కళాఖండానికి అప్పట్లో వెయ్యి రూపాయల ధర పలికింది. ఇప్పుడు అదే చిత్రరాజం ఏకంగా రూ. 19.19 కోట్లకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది. మన దేశంలో కళలపై నానాటికీ పెరిగిపోతున్న ఆసక్తికి ఇది అద్దం పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1960లో 20వ పడిలో ఉన్న అక్బర్ పదంసీ 4.3x12 కాన్వాస్‌పై ఈ దృశ్య కళాఖండాన్ని చిత్రించారు. దీనిని ఆయన మిత్రుడు, స్నేహితుడు అయిన క్రిషేన్ ఖన్నా 1960లో రూ. వెయ్యికి కొనుగోలు చేశారు. దీనిని పర్సనల్ కలెక్షన్గా ఇన్నాళ్లు తనతో ఉంచుకున్న ఆయన ఇటీవల ఢిల్లీలో వేలానికి పెట్టారు. గుర్తుతెలియని ఓ ఔత్సాహికుడు ఈ పెయింటింగ్‌ను ఏకంగా రూ. 19.19 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. దేశంలో సమకాలీన చిత్రకారుల్లో అగ్రగణ్యుడైన అక్బర్ పదంసీ పెయింటింగ్‌లలో అత్యధిక ధర పలికిన కళాఖండం ఇదే. తన స్నేహితుడైన పదంసీ పెయింటింగ్‌కు ఇంత ధర పలుకడం తనకు ఆనందంగా ఉందని, పదంసీ చిత్రించిన కళాఖండాల్లో ఇది ఉత్తమమైనదని 92 ఏళ్ల ఖన్నా ఆనందం వ్యక్తం చేశారు. గత 60 ఏళ్లలో ఈ చిత్రరాజాన్ని తాను చూడలేదని, తాను 22, 23 ఏళ్ల వయస్సులో దీనిని చిత్రించానని 89 ఏళ్ల పదంసీ చెప్పారు.


