సర్పంచ్‌ సీటుకు డిమాండ్‌.. ఎకరం పొలం.. 50 లక్షలు.. | Sarpanch Post Auction in West Godavari | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ సీటుకు డిమాండ్‌.. ఎకరం పొలం.. 50 లక్షలు..

Nov 12 2026 11:48 AM | Updated on Nov 12 2026 12:08 PM

Sarpanch Post Auction in West Godavari

సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఇంకా మొదలుకాకముందే పదవుల కోసం వేలం పాటలు నడుస్తున్నాయి. పలుచోట్ల సర్పంచ్‌ పదవుల కోసం భారీ మొత్తంలో ఆఫర్‌ చేస్తున్నట్టు సమాచారం. ఏకంగా సర్పంచ్‌ పదవి కోసం రూ.50 లక్షలు ఇస్తానని ఆఫర్‌ చేసినట్లు తెలిసింది.

వివరాల మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. నరసాపురం మండలం తూర్పు తాళ్లులో సర్పంచ్‌ పదవి కోసం ఏకంగా వేలం పాట నడిచినట్లు ప్రచారం కలకలం రేపుతోంది. గ్రామంలో ఎన్నిక ఏకగ్రీవం చేస్తే ఎకరం పొలం ఇస్తానని ఓ అభ్యర్థి ముందుకొచ్చి గ్రామ పెద్దలకు ఆఫర్‌ ఇచ్చారు. ఇంతలో మరో వ్యక్తి రూ.50 లక్షలు ఇస్తానని ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి గ్రామ పెద్దలు సమావేశమై చర్చించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అసలు సర్పంచ్‌ పదవికి ఇంత డిమాండా? అంటూ ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా.. పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం కుట్రలు బయటకు వస్తున్నాయి. అడ్డగోలుగా నామినేషన్‌ కేంద్రాలను టీడీపీ నేతలు మార్చుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్సార్‌సీపీకి పట్టున్న గ్రామాల్లో యధేచ్చగా అక్రమాలు జరుగుతున్నాయి. ఎంపీడీవోలతో నామినేషన్ కేంద్రాల మార్పులు చేసినట్టు తెలుస్తోంది. 

ఇదీ చదవండి: ఎమ్మెల్యే టికెట్‌ చేజారింది.. జెడ్పీ పీఠమైనా దక్కేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement