బాబూ.. నేను బతికే ఉన్నా.. | Woman Farmer Declared Dead in Government Records Seeks Justice in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బాబూ.. నేను బతికే ఉన్నా..

Nov 12 2026 11:09 AM | Updated on Nov 12 2026 11:09 AM

Woman Farmer Declared Dead in Government Records Seeks Justice in Andhra Pradesh

నిరసన తెలుపుతున్న యలమంచిలి నాగమణి, స్థానికులు

ఎన్టీఆర్‌ జిల్లా: బాబూ.. నన్ను మీరు రికార్డుల్లో చాలా కాలం క్రితమే చంపేశారు. నేను అప్పుడూ, ఇప్పు­డూ బతికే ఉన్నాను. చాలా రోజులు­గా మీ చుట్టూ తిరుగుతున్నా. దయ­చేసి నన్ను రికార్డుల్లోనూ బతికించండి. నేను బతికే ఉన్నట్లు నమోదు చేయండి’ అంటూ ఓ మహిళా రైతు బుధ­వారం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రా­మంలో అధికారుల ఎదుట నిరస­న తెలిపింది. 

గ్రామానికి చెందిన మహి­ళా రైతు యలమంచిలి నాగమణి బతికుండగానే చనిపోయినట్లు అధి­కా­రులు రికార్డుల్లో నమోదు చేశారు. తాను బతికే ఉన్నానని, ఈమేరకు రికార్డుల్లో మార్పులు చేయాలని చాలా­కాలంగా వేడుకొంటోంది. రికా­ర్డుల్లో తాను చనిపోయినట్లు ఉండటంతో ఏడాదిన్న­రగా అన్నదాత సుఖీ­భవ, రైతు భరో­సా వంటి ప్రభుత్వ సహాయం నిలి­చిపోయిందని తెలిపా­రు. రేషన్‌కార్డు కూడా తీసేశారని, అ«ధికారుల చుట్టూ తిరిగి దానిని పున­రుద్ధరించుకున్నట్లు తెలిపారు. 

తాను బతికున్నట్లు రికార్డు­ల్లో సరిచేయాలని స్థానిక సచి­వాల­యంతో పాటు కలెక్టర్‌ కార్యా­లయం గ్రీవెన్స్‌లో ఫిర్యా­దు చేసినా పరిష్కా­రం కాలేద­న్నారు. సమస్య పరిష్కారం అయిన­ట్లు ఓ రోజు కాగితం వచ్చిందని, అధికారులు సంతకం చేయమంటే తెలియక చేశానని, కానీ రికార్డుల్లో మార్పు లేదని తెలిపారు. చివరకు బుధవారం సాయంత్రం గ్రామ సచివాలయం వద్ద ఆమె నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఆమెకు బాసటగా నిలిచారు. సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటమాడే అధికా­రులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement