సాక్షి, విజయవాడ: విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. 55వ డివిజన్ ఎన్నికల బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు పక్కన హస్తం గుర్తు ముద్రించగా.. కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదుట ఫ్యాన్ గుర్తు ముద్రించారు.
అయోమయంలో ఓటర్లు
పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తూ ఆర్వో గతంలో విడుదల చేసిన ఫారం-11లో మాత్రం సక్రమంగానే గుర్తులు ఉన్నాయి. అధికారులు ఉద్దేశపూర్వకంగా గుర్తులు మార్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి.. ఆర్వోకు ఫిర్యాదు చేశారు. గుర్తుల తారుమారుతో ఓటర్లు అయోమయంలో పడ్డారు.
అనుమానాలు..
బ్యాలెట్ పేపర్ల ముద్రణలో అధికారుల వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. సీరియల్ నంబర్లు లేకుండా పలు చోట్ల అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. నిబంధనలకు విరుద్ధంగా బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. 55వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సింబల్‌ను పోలింగ్ అధికారులు మార్చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఫిర్యాదుతో 55వ డివిజన్‌లో పోలింగ్‌ను ఆర్వో నిలిపివేశారు. కొత్త బ్యాలెట్ పేపర్లు వచ్చిన తర్వాత పోలింగ్ నిర్వహించనున్నారు. మరో రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఫిర్యాదుతో బ్యాలెట్ పేపర్ మార్చుతున్నట్లు ఆర్వో తెలిపారు.
కూటమి కుట్ర: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ హుసేన్ బాషా మాట్లాడుతూ.. కూటమి కుట్ర చేసిందని.. బ్యాలెట్ పేపర్‌లో తప్పుగా ఎన్నికల గుర్తులు ముద్రించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ బ్యాలెట్ ముద్రంచాలని అడిగాం.. బ్యాలెట్‌లు ముద్రిస్తున్నామని అధికారులు చెప్పారు. మరో రెండు గంటలు సమయం పడుతుంది. పోలింగ్ ఆలస్యమవుతుంది కాబట్టి సమయం పెంచమని కోరుతున్నాం. సాయంత్రం బయట వ్యక్తులు రాకుండా చర్యలు తీసుకోవాలి’’ అని హుసేన్ బాషా కోరారు.
ఇదీ చదవండి: వైఎస్ ప్రమీలమ్మపై దాడి


