గెలుపు కోసం కూటమి అడ్డదారులు | - | Sakshi
Sakshi News home page

గెలుపు కోసం కూటమి అడ్డదారులు

Nov 1 2026 8:25 AM | Updated on Nov 1 2026 8:25 AM

● విజయవాడలో విచ్చలవిడిగా ఓటర్లకు నగదు పంపిణీ ● పట్టించుకోని ఎన్నికల అధికారులు, పోలీసులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: మునిసిపల్‌ ఎన్నికల్లో అధికార కూటమి అడ్డదారులు తొక్కుతోంది. విజయవాడ మేయర్‌ పదవిని దక్కించుకునేందుకు ఎందాకైనా అంటూ డబ్బు పంపిణీకి పాల్పడుతోంది. విచ్చలవిడిగా ఓట్ల కొనుగోలుకు తెరతీసింది. నియంత్రించాల్సిన పోలీసులు, అడ్డుకోవాల్సిన ఎన్నికల అధికా రులు చేష్టలుడిగి చూస్తున్నారు. నగదు, మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిబంధనలు వల్లిస్తున్నారే తప్పా, ఎక్కడా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పట్టపగలు బాహాటంగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఆడియో, వీడియోలో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నా అబ్బే.. అదేం లేదన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఓటుకు రూ.1000 చొప్పున పంచుతున్నారు. ఇలా రెండు రోజులుగా ప్రతి డివిజన్‌లో జరుగుతున్నప్పటికీ ఎక్కడా డబ్బులు పంపిణీ చేసేవారిని పట్టుకున్న దాఖలాలు లేవు. గాంధీనగర్‌లో ఓ ఇంట్లోకి వెళ్లి కూటమి నేతలు ఓట్లు కొనుగోలు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఏకంగా జనసేన గాజు గ్లాసు, బీజేపీ కమలానికి ఓటు వేయాలని డబ్బులు లెక్కిస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు వీడియో స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై చర్యలు మాత్రం కనిపించడం లేదు. అలాగే పాత రాజరాజేశ్వరిపేటలో డబ్బుల పంపిణీ ఉద్రిక్తంగా మారింది. అధికార కూటమి డబ్బులు పంపిణీ చేస్తోందని తెలియగానే అక్కడికి వెళ్లిన మహిళల మధ్య తోపులాట జరిగింది. విజ యవాడ నగర కార్పొరేషన్‌ ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటుకు నోటుకు తెరతీసింది. ఇప్పటికే నగరంలోని డివిజన్లపై పడి ఇష్టారాజ్యంగా డబ్బు పంపిణీ చేశారు. మిగిలిన వారికి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు వస్తే ఓటింగ్‌ సమయంలోనూ డబ్బులు పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నారు. అడ్డూ ఆపు లేకుండా డబ్బు పంపిణీ సాగుతుండడంతో ఎన్నికల అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement