సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం

Nov 1 2026 8:25 AM | Updated on Nov 1 2026 8:25 AM

పెడనలో 32 పోలింగ్‌ కేంద్రాలు జిల్లాలో కార్పొరేషన్‌, రెండు మునిసిపాలిటీలకు ఎన్నికలు

అప్రమత్తంగా

వ్యవహరించాలి

ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,97,412 మంది

మొత్తం 241 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌

పురపోరుకు

పోలింగ్‌ బాక్సులను తరలిస్తున్న సిబ్బంది

పెడన మునిసిపాలిటీలో చైర్మన్‌ అభ్యర్థులుగా ముగ్గురు బరిలో ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ తరఫున కటకం నాగకుమారి, జనసేన నుంచి బళ్ల జ్ఞానలింగ జ్యోత్స్నరాణి, స్వతంత్ర అభ్యర్థిగా నాదెళ్ల తరుణ్య బరిలో ఉన్నారు. 28 వార్డులకు 61 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 25,373 మంది ఓటర్లలో 12,212 మంది పురుషులు, 13,161 మంది మహిళలు ఉన్నారు. వారి కోసం 32 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నగరపాలక సంస్థతో పాటు పెడన, ఉయ్యూరు మునిసిపాలిటీల ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. పోలింగ్‌ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. ఎన్నికల్లో మొత్తం 1,97,412 మంది ఓటు హక్కు వినియోగించుకోన్నారు. 241 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ జరుగుతుంది. పోలింగ్‌ ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. మచిలీపట్నం నోబుల్‌ కళాశా లలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుంచి సిబ్బందిని ఆయా పోలింగ్‌బూత్‌లకు తరలించారు.

మచిలీపట్నంలో 161 పోలింగ్‌ కేంద్రాలు

మచిలీపట్నం మేయర్‌ స్థానానికి ఐదుగురు బరిలో ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ తరఫున లంకా జ్యోతి, టీడీపీ నుంచి అబ్దుల్‌ అబీదా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి షేక్‌ రహీమున్నీసా, స్వతంత్రులుగా అక్తర్‌ జమానీ బేగం, షేక్‌ ఫైజున్నీసా బరిలో ఉన్నారు. 60 కార్పొరేటర్‌ స్థానాలకు 142 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1,39,246 మంది ఓటర్లలో 66,504 మంది పురుషులు, 72,732 మంది మహిళలు ఉన్నారు. వారి కోసం 161 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు.

ఉయ్యూరులో 48 పోలింగ్‌ కేంద్రాలు

ఉయ్యూరు మునిసిపాలిటీలో చైర్మన్‌ అభ్యర్థులుగా ఆరుగురు బరిలో ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పైడిముక్కల దివ్య, టీడీపీ నుంచి చెదుర్తిపాటి ప్రవీణ్‌కుమార్‌, బీఎస్పీ నుంచి కనకపల్లి వెంకట్రామ్‌, కాంగ్రెస్‌ నుంచి పినమాల నాగకుమారి, స్వతంత్ర అభ్యర్థులుగా పినమాల కోటేశ్వరరావు, మట్టా పూర్ణ చంద్రరావు పోటీ చేస్తున్నారు. 32 వార్డులకు గానూ 86 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 32,793 మంది ఓటర్లలో 15,768 మంది పురుషులు, 17,024 మంది మహిళలు ఉన్నారు. 48 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

1100 మంది పోలీస్‌ బందోబస్తు

మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు 1100 మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీతో పాటు ఇరువురు ఏఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 29 మంది సీఐలు, 67 మంది ఎస్‌ఐలను నియమించారు. 192 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 469 మంది కానిస్టేబుళ్లు, 221 మంది హోంగార్డులు, 72 మంది ఏఆర్‌ సిబ్బంది నియమించారు. గార్డ్‌ డ్యూటీలో మరో 30 మందిని ఏర్పాటు చేశారు.

ఎన్నికల విధుల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వకుండా, నిబంధనలకు అనుగుణంగా ప్రతి దశను జాగ్రత్తగా పూర్తి చేయాలని కలెక్టర్‌ డి.కె.బాలాజీ ఆదేశించారు. మచిలీపట్నంలోని నోబుల్‌ కళాశాల, పెడనలోని పల్లోటి స్కూల్‌, ఉయ్యూరులోని సిద్ధార్థ డిగ్రీ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను కలెక్టర్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ విధులకు హాజరైన ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర పోలింగ్‌ అధికారులతో కలెక్టర్‌ మాట్లాడారు. రిటర్నింగ్‌, ప్రిసైడింగ్‌ అధికారుల హ్యాండ్‌బుక్‌లో పొందుపరిచిన ప్రతి నిబంధనను పాటించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో అందించే ఎన్నికల సామగ్రిని చెక్‌లిస్ట్‌ ప్రకారం ఒక్కొక్కటిగా సరిచూసుకొని స్వీకరించాలని, బ్యాలెట్‌ పేపర్లు, బ్యాలెట్‌ బాక్సులు, ఇతర సామగ్రి వివరాలు, సీరియల్‌ నంబ ర్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మునిసిపల్‌ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల నోడల్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement