ఎన్నికలను నిరంతరం పర్యవేక్షించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలను నిరంతరం పర్యవేక్షించాలి

Nov 1 2026 8:25 AM | Updated on Nov 1 2026 8:25 AM

జి.కొండూరు: ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు నిరంతరం పర్య వేక్షించాలని ఎన్టీఆర్‌ జిల్లా ఎలెక్షన్‌ ఎక్స్‌పెండించర్‌ అబ్జర్వర్‌ వి.విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణ తీరుపై మండలం రిటర్నింగ్‌ అధికారి నాగమల్లికను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి ప్రతిరోజూ రిపోర్టులను సేకరించాలని మండలం ఎక్స్‌పెండించర్‌ అబ్జర్వర్‌ అధికారి స్టాలిన్‌ను ఆదేశించారు. వీడియో సర్వైలెన్స్‌ టీమ్‌ చిత్రీకరించిన వీడియోలను పరిశీలించి షోడో అబ్జర్వేషన్‌, రికార్డు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

కృష్ణా వర్సిటీ పురుషుల హాకీ జట్టు ఎంపిక

నున్న(విజయవాడరూరల్‌): కృష్ణా విశ్వవిద్యాలయ పురుషుల హాకీ జట్టును నున్న విజయా కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో శనివారం ఎంపిక చేశారు. వివిధ కళాశాలలకు చెందిన క్రీడాకారులు హాజరవగా, ప్రతిభ, ఆట తీరు ఆధారంగా 14 మందిని జట్టుకు ఎంపిక చేశారు. వర్సిటీ స్పెర్ట్స్‌ బోర్డు సెక్రటరీ డాక్టర్‌ నల్లూరి శ్రీనివాసరావు, అబ్జర్వర్‌ ఎస్‌.ఆర్‌.కె.పరమహంస, ఆర్‌.రాజశేఖర్‌ సెలక్షన్‌ కమిటీ మెంబర్లుగా వ్యవహరించారు. ఎంపికై న జట్టు ఈ నెల 28వ తేదీ నుంచి చెన్నయ్‌లోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే సౌత్‌ జోన్‌ అంతర్‌ విశ్వవిద్యాలయాల పురుషుల హాకీ టోర్నీలో ప్రాతినిధ్యం వహిస్తుందని ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ డి.రత్నబాబు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.ఉదయ్‌ కుమార్‌, కార్యదర్శి ఎన్‌.సత్యనారాయణరెడ్డి అభినందించారు.

ఓటరు స్లిప్పుల పంపిణీలో అలసత్వంపై ఆగ్రహం

నందిగామ రూరల్‌: మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎన్నికల సిబ్బంది, సచివాలయ ఉద్యోగుల అలసత్వాన్ని నిరసిస్తూ ఓటర్లు ఆందోళనకు దిగారు. నందిగామ డీవీఆర్‌ కాలనీకి చెందిన పలువురు ఓటర్లు శనివారం సచివాలయం ఎదుట ఆందో ళన చేశారు. ఆదివారం ఎన్నికలు జరుగుతున్నా స్లిప్పులు పంపిణీ చేయకపోవటంలో ఆంతర్యమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు స్లిప్పులు అందజేయకపోవటంతో తమ ఓటు ఏ వార్డులో ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు

పామర్రు: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్టు కృష్ణా జిల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పరిశీలకుడు వి.అభిషేక్‌ తెలిపారు. పామర్రులో శనివారం ఆయన పోలింగ్‌ స్టేషన్ల వారీగా బ్యాలెట్‌ పత్రాల సర్దుబాటు చేసే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీలు వేసిన బ్యాలెట్‌ బాక్స్‌లను పెట్టెలలో పెట్టి పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరిచి ఎన్ని కల ముందు రోజు పోలింగ్‌ అధికారులకు అందజేయాలని చెప్పారు. పోలింగ్‌ రోజు ఓటర్లకు అందజేసే బ్యాలెట్‌ పత్రాల నమూనాలు పక్కాగా ఉన్నాయా? లేదా? వాటిపై ముద్రించిన అభ్యర్థుల ఎన్నికల గుర్తులు సక్రమంగా ఉన్నాయా అనే అంశాలను నిశితంగా పరిశీలించామన్నారు. బ్యాలెట్‌ పత్రాల వరుస సంఖ్యలో వ్యత్యాసాలు రాకుండా సిబ్బంది తీసుకున్న జాగ్రత్తలను ఆరా తీశామన్నారు. పామర్రు మండలానికి చెందిన 16 ఎంపీటీసీ స్థానాలకు కేటాయించిన బ్యాలెట్‌ పత్రాలను పక్కాగా భద్రపరిచే ప్రక్రియను పర్యవేక్షించామన్నారు. కార్యక్రమంలో పామర్రు ఆర్వో జి.రవికాంత్‌, సహాయ ఎన్నికల అధికారి కాండ్రు జ్యోతి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement