మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అప్‌డేట్స్..
అనంతపురం..
- మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కామెంట్స్..
- ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
- ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
- ప్రజాస్వామ్యానికి ఓటే ఆయుధం.
- ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి.
- అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో అరాచకవాదులకు ఓటుతో బుద్ధి చెప్పాలి.
- దౌర్జన్యాలు, రౌడీయిజానికి ఓటుతోనే సమాధానం చెప్పాలి.
- డబుల్ రిజిస్ట్రేషన్లకు కూడా ఓటుతో బుద్ధి చెప్పాలి.
మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ కామెంట్స్...
- అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రశాంత వాతావరణం కావాలి.
- ఇప్పుడు అనంతపురాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
- హింసా రాజకీయాలను నమ్ముకున్న వారికి ఓటుతో సమాధానం చెప్పాలి.
- ప్రతి ఓటు మార్పునకు నాంది కావాలి.
పల్నాడు జిల్లా..
- మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలు..
- మాచర్ల మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం.
- ప్రజాస్వామ్యంలో అక్రమ అరెస్టులు సరికాదని వ్యాఖ్య.
- వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా చేసి, అభ్యర్థులను బూత్‌లకు రాకుండా అరెస్టులు చేస్తున్నారని ఆరోపణ.
- ఇలాంటి పరిణామాలపై ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్న.
- బూత్ క్యాప్చరింగ్ చేసి భారీగా రిగ్గింగ్ చేయడానికే అరెస్టులు చేస్తున్నారని ఆరోపణ.
- మొత్తం 12 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో పాటు పార్టీ నేతలను పోలీసులు స్టేషన్‌లో నిర్బంధించారని వెల్లడి.
- నాలుగు గంటలుగా అభ్యర్థులు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు.
- పోలింగ్ ప్రారంభమైనా బూత్‌ల పరిశీలనకు కూడా వెళ్లకుండా అభ్యర్థులను అరెస్టు చేశారని ఆరోపించారు.
మదనపల్లిలో పోలీసుల అత్యుత్సాహం
- అన్నమయ్య జిల్లా..
- మదనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో పోలీసుల అత్యుత్సాహం
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి జింక చలపతి నేలపై కూర్చుని నిరసన
- తనపై లాఠీలతో దాడి చేశారని, కాలితో తన్ని బయటకు నెట్టేశారని పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చలపతి
- ఎన్నికల అధికారి జారీ చేసిన అధికారిక పాస్/ఐడీ కార్డును మీడియాకు, పోలీసులకు చూపిస్తూ,
- సరైన అనుమతి ఉన్నప్పటికీ తనను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని ఆగ్రహం
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బలవంతంగా పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించి వేస్తున్నారని ఆగ్రహం.
- టీడీపీ వారిని మాత్రం లోపల కూర్చోబెట్టి, తమను మాత్రం దురుసుగా బయటకు నెట్టారన్న చలపతి
- శివకుమార్ అనే అధికారి తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం
వైఎస్సార్‌సీపీ నేతలు అరెస్ట్..
- చిలుకలూరిపేటలో విడదల రజిని హౌస్ అరెస్ట్.
- కడప మాజీ మేయర్ పాకా సురేష్ అరెస్ట్.
- వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులను పట్టించుకోని పోలీసులు.
- దాడులపై ఫిర్యాదు చేసిన మాజీ మేయర్ అరెస్ట్.
అన్నమయ్య జిల్లా..
- మదనపల్లిలో ఉద్రిక్తత.
- పోలింగ్ బూత్‌లోకి తమ ఏజెంట్లను అనుమతించకపోవడంపై వైఎస్సార్‌సీపీ ఆందోళన.
- మరోవైపు.. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హౌస్ అరెస్ట్.

గుర్తులు తారుమారు..
- విజయవాడ నగరపాలక సంస్థ 55వ డివిజన్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల గుర్తులు తారుమారు
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు ముందు హస్తం గుర్తు.
- కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదుట ఫ్యాన్ గుర్తు ముద్రణ
- పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తూ ఆర్ఓ గతంలో విడుదల చేసిన ఫారం-11లో మాత్రం సక్రమంగానే గుర్తులు
- అధికారులు ఉద్దేశపూర్వకంగా గుర్తులు మార్చారా? అనే అనుమానాలు
- ఆర్ఓ వద్దకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి.
- ఏం జరుగుతుందోనని డివిజన్‌లో తీవ్ర ఉత్కంఠ
వైఎస్ ప్రమీలమ్మపై దాడి..
- పులివెందులలో టీడీపీ గూండాగిరి
- వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిపై దాడి.
- బూత్ నెంబర్ 21 వద్ద వైఎస్ ప్రమీలమ్మపై దాడి.
- మహిళా అభ్యర్థిపై దాడికి తెగబడ్డ టీడీపీ గూండాలు.
- పోలింగ్ బూత్‌ల వద్ద టీడీపీ నేతలు తిష్ట వేశారు: వైఎస్ ప్రమీలమ్మ.
- పోలింగ్ కేంద్రాలకు వెల్లకుండా అడ్డుకుంటున్నారు.
- మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిని నన్నే అడ్డుకున్నారు.
- వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డగించి రిగ్గింగ్‌కు కుట్ర.
50 శాతం పోలింగ్ కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు..
- ఏపీలో 50 శాతం పోలింగ్ కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు.
- అన్ని చోట్లా సీసీ కెమెరాలు పెట్టలేమన్న ఎస్‌ఈసీ.
- అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్ ఉండాలన్న సుప్రీంకోర్టు.
- 5737 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు.
వైఎస్సార్ జిల్లా..
- పులివెందులలో టీడీపీ మరో కుట్ర.
- భారీగా దొంగ ఓట్ల వేయించుకునేందుకు టీడీపీ పన్నాగం.
- ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను దింపుతున్న టీడీపీ.
- దొంగ ఓటర్లకు 1500 చొప్పున ఇచ్చి దింపుతున్న బీటెక్ రవి.
- అల్లర్లకు ముందుగానే రౌడీలను సిద్ధం చేసుకున్న టీడీపీ.

పోలీసులు లాఠీచార్జ్
- పులివెందులలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్
- బూత్ నెంబర్ 17 వద్ద లాఠీచార్జ్.
- పులివెందులలో టీడీపీ గూండాల స్వైర విహారం
- పులివెందుల బూత్ నెంబర్ 38 వద్ద కర్రలతో హల్‌చల్
- కర్రలతో బహిరంగంగా తిరుగుతున్న టీడీపీ గూండాలు
- కడపలో కొనసాగుతున్న పచ్చ మూకల అరాచకాలు
- పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల అడ్డగింత.
- ఏజెంట్ల ఫామ్‌లను చించేసిన టీడీపీ గూండాలు.
- టీడీపీ రౌడీలు హల్‌చల్ చేస్తున్నా పట్టించుకోని పోలీసులు.
- మేయర్ అభ్యర్థి బండి దీప్తిని అడ్డుకున్న పోలీసులు.

పల్నాడు జిల్లా..
- మాచర్ల మున్సిపాలిటీలో కొనసాగుతున్న పచ్చ గూండాలు, పోలీసుల అరాచకాలు
- పోలింగ్ బూత్‌ల వద్ద మాటువేసిన టీడీపీ గూండాలు
- గుంపులు గుంపులుగా పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ మూకలు
- పోలింగ్ బూతుల్లో కేవలం టీడీపీ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం
- మరోవైపు కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకుల అరెస్టులు
- ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు
- కనీసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు పోలింగ్ బూత్‌లను పరిశీలించే అవకాశం కూడా ఇవ్వని పోలీసులు, అధికారులు.
- మొత్తం ఓటర్లు 99,36,014 మంది.. 11,378 పోలింగ్ కేంద్రాలు
- 13 నగరపాలక సంస్థలు, 79 మున్పిపాలిటీలకు ఎన్నికలు
- 13 మేయర్ పదవులకు పోటీలో 153 మంది
- మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులకు పోటీలో 367 మంది
- బందోబస్తుకు 36,351 మంది పోలీసులు
- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్
- 13 నగరాల్లో ఉన్న 59,97,918 మంది ఓటర్ల కోసం 6,384 పోలింగ్ కేంద్రాలు,
- 79 మున్సిపాలిటీల్లో ఉన్న 39,38,096 మంది ఓటర్ల కోసం 4,994 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.
పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య
- 13 కార్పొరేషన్ల మేయర్ పదవులకు – 153 మంది
- కార్పొరేషన్లలోని 804 డివిజన్లకు – 3,073 మంది
- 70 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్ పదవులకు – 367 మంది
- 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 2,382 వార్డు కౌన్సిలర్ పదవులకు – 6,669 మంది
పోలింగ్ సిబ్బంది ఇలా..
- రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) – 1,449 మంది
- సహాయ రిటర్నింగ్ అధికారులు – 2,543 మంది
- ప్రిసైడింగ్ అధికారులు – 13,504 మంది
- అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు – 13,504 మంది
- ఇతర పోలింగ్ అధికారులు – 51,716 మంది
- మైక్రో అబ్జర్వర్లు – 3,720 మంది
- వెబ్‌కాస్టింగ్ సిబ్బంది – 1,835 మంది
- మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం
వైఎస్సార్ జిల్లా..
- పులివెందులలో పచ్చ మూకల అర్ధరాత్రి అరాచకం
- ఓ వివాహానికి వచ్చిన వారి వాహనాలను దహనం చేసిన పచ్చ మూకలు
- మూడు కార్లు, ఒక ట్రాక్టర్ దగ్దం చేసిన టీడీపీ గూండాలు
- పోలింగ్ సందర్భంగా ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసే కుట్ర
- రాత్రి పెద్ద ఎత్తున మద్యం సేవించి విచ్చలవిడిగా స్వైర విహారం చేసిన పచ్చ మూకలు
- తెల్లవారు జామునే పోలింగ్ బూత్‌ల వద్ద తిష్ట వేసిన పచ్చ మూకలు


