మున్సిపాలిటీ ఎన్నికల వేళ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ‘ఆలోచించండి...విజ్ఞతతో తీర్పు ఇవ్వండి’ అంటూ మేధావుల ఫోరం పేరిట ఓ బహిరంగ లేఖ వైరల్ అయ్యింది. అసలు టీడీపీకి ఓటేందుకు వేయాలంటూనే అనేక అభివృద్ధి అంశాలను అందులో పేర్కొన్నారు. ఆ లేఖలో అంశాలు యథాతథంగా...

ట్రిపుల్‌ఐటీ
ప్రజలారా...వైఎస్సార్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి. ఏం చేశారు, ఏం చూసి ఓట్లు వేయాలి. కసనూరు సంస్కృతి తెరపైకి తెచ్చి భయానక పరిస్థితులు కల్పిస్తున్నందుకా? ప్రశాంత వాతావరణం ఉన్న పట్టణాల్లో విచ్చలవిడి దౌర్జన్యం చేస్తున్నందుకు ఓటెయ్యాలా? పచ్చటి గ్రామాల్లో రక్తపాతం పారిస్తున్నందుకు ఓటెయ్యాలా? కామధేనువు లాంటి వైఎస్ కుటుంబాన్ని కాదనీ పక్కవారికి ఎందుకు బలపర్చాలి? పులివెందుల, కడప, జమ్మలమడుగు తదితర పట్టణ ఓటర్లు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. అభివృద్ధికి వైఎస్ కుటుంబం చిరునామా. ఎన్నోఏళ్లు అధికారంలో ఉన్నామని చెప్పుకునేందుకు మాత్రమే సీఎం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ పరిమితం.
నిర్దిష్టమైన అభివృద్ధి చేశామని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటీ లేదు. పులివెందుల, కడప, జమ్మలమడుగులో అభివృద్ధంటూ ఉందంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మాత్రమే. ఈ విషయం మీకు తెలియంది కాదు, కళ్లెదుట కని్పస్తోంది. విద్యాపరంగా జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ, స్కిల్ డెవెలప్‌మెంట్ సెంటర్, నాడు–నేడు పథకంలో అపురూపంగా మారిన పాఠశాలలు, పుడ్ సైన్స్ కాలేజి ఇట్టే గుర్తు చేస్తున్నాయి.. ఆరోగ్య రంగంలో డాక్టర్ వైఎస్సార్ మెడికల్ కళాశాల, నర్శింగ్ కళాశాల, ఉపాధి రంగంలో యూసీఐల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్, గోవిందరాజా టెక్స్‌టైల్స్, వ్యవసాయ రంగంలో చీనీ మార్కెట్ యార్డ్, బనానా రీసెర్చ్ సెంటర్, ఐజిసీఏఆర్‌ఎల్ (ఐజీ కార్ల్), డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ గుర్తుకు వస్తాయి. ఒక ప్రాంతంలో ఇన్నీ సంస్థలు రావడం సాధ్యమా? వైఎస్ కుటుంబం చలువే కదా ఇదంతా! 
సుందరంగా రూపుదిద్దుకున్న రోడ్లు
అభివృద్ధిలో చెరగని ముద్ర వైఎస్ కుటుంబానికే సొంతం...
విద్య, వైద్యం, మౌళిక వసతులతో పాటు పారిశ్రామిక ప్రగతి వేగంగా జిల్లా వ్యాప్తంగా రూపుదిద్దుకుందంటే అది వైఎస్ పాలనలోనే. ఆల్‌డిక్సన్, సెంచురీ ఫ్లైబోర్డ్స్, ఆదిత్యా బిర్లా గార్మెంట్స్ లాంటి సంస్థలు కొలువుదీరాయి. జేఎస్‌డబ్ల్యూ నేతృత్వంలో స్టీల్ ప్లాంట్ పురుడు పోసుకుంది వైఎస్ జగన్ హయాంలోనే. కడపలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వచ్చింది. మెడికల్ హబ్‌గా రిమ్స్ రూపుదిద్దుకుంది. 452 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్యశాల, 100 పడకల మానసిక వైద్యశాల, 100 పడకల కేన్సర్ హాస్పిటల్‌ను నెలకొల్పారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో 801ఎకరాలల్లో వైఎస్సార్ ఎల్రక్టానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. రూ.10వేల కోట్లు పెట్టుబడులు సమీకరించి లక్ష ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రణాళికలు చేశారు.
అందులోభాగంగానే వేగంగా పారిశ్రామిక అడుగులు పడ్డాయి. రూ.80 కోట్లతో ఏర్పాటు చేసిన ఆల్‌డిక్సన్ కంపెనీ (ఎల్రక్టానిక్ ఉత్పత్పుల సంస్థ) ప్రారంభమైంది. బద్వేల్ కేంద్రంగా సెంచురీ ఫ్లైబోర్డ్స్ సంస్థ వచ్చి చేరింది. జిల్లా కేంద్రమైన కడప నగరం సుందరీకరణ కనువిందుగా రూపుదిద్దుకుంది. దశాబ్దాలు తరబడి పెండింగ్‌లో ఉన్న రహదారులు విస్తరణ వేగంగా చేపట్టారు. రూ.120 కోట్లతో నగరంలోని 12 జంక్షన్లను వృద్ధి చేశారు. రూ.6.85 కోట్లతో రాజీవ్‌మార్గ్ రోడ్డు, రాజీవ్ ఫార్క్ ఆధునీకరించారు. రూ.69.2 కోట్లుతో పాత బళ్లారి రోడ్డు, రూ.100 కోట్లుతో దేవుని కడప రోడ్డు విస్తరణ చేపట్టారు. రూ.10కోట్లతో ఇండస్ట్రీయల్ ఎస్టేట్ రోడ్డు నిర్మించారు.

వైఎస్సార్ –ఏసీఏ క్రికెట్ స్టేడియం
మెట్ట ప్రాంతానికి కృష్ణా జలాలు
కృష్ణా జలాలు మెట్ట ప్రాంతంలో పారించాలనే తపన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిది. అందుకే గండికోట రిజర్వాయర్ నుంచి నీరు లిఫ్ట్ చేసి, పైడిపాలెం రిజర్వాయర్ నిల్వ చేసే బృహత్తర ప్రాజెక్టు తీసుకొచ్చారు. మూడు టీఎంసీలకు మాత్రమే పరిమితమైన చిత్రావతి ప్రాజెక్టు 10 టీఎంసీలకు విస్తరించారు. గండికోట నుంచి చిత్రావతి లిఫ్ట్ ద్వారా నీరు తీసుకొచ్చారు. కుడి, ఎడమ కాలువలు తవ్వారు. బ్రహ్మంసాగర్, గండికోట, వామికొండ, సర్వారాయసాగర్ ఆయన హయాంలో రూపుదిద్దుకున్నవే. అద్భుతమైన రోడ్డు కనెక్టవిటీ సౌకర్యం కల్పించారు.

క్యాన్సర్ హాస్పిటల్
బెంగళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్స్, విలేజ్ కనెక్టివిటీ రోడ్స్, సచివాలయాలు, వరల్డ్ క్లాస్ ఆర్టీసీ బస్టాండ్, క్రికెట్ స్టేడియం, మినీ సెక్రటేరియట్ ఉలిమెల్ల లేక్‌వ్యూ, రాణి తోపుల ఇవన్నీ వైఎస్ కుటుంబం తీసుకొచ్చినవే కదా! నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2024–25 విద్యా సంవత్సరంలోనే పులివెందుల మెడికల్ కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసింది. నిర్దయగా వద్దని చంద్రబాబు సర్కార్ లేఖ రాసింది. రాయలసీమ శాశ్వత కరువు నివారణ కోసం రూపొందించిన జీఎన్‌ఎస్‌ఎస్ నుంచి హచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అనుసంధానం ప్రాజెక్టును మరుగున పర్చారు. ఎలాంటి పురోగతి లేదు.

కొప్పర్తి పారిశ్రామిక వాడ బోర్డు
జిల్లా ఓటరు మహాశయా.. ఇప్పుడు చెప్పు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి?! ఆలోచించండి...విజ్ఞత ప్రదర్శించండి. నిర్భయంగా మీ ఓటు హక్కును మీరే వినియోగించుకోండి!! కడప పౌరుషం ముందు కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలు దిగదుడుపేనని తెలియజేయండి!!
– మేధావుల ఫోరం, వైఎస్సార్ కడప జిల్లా
– సాక్షి ప్రతినిధి, కడప


