ఈ గుర్తింపు కార్డుల్లో ఏదున్నా ఓటు వేయొచ్చు | You can vote with any of these identity cards | Sakshi
Sakshi News home page

ఈ గుర్తింపు కార్డుల్లో ఏదున్నా ఓటు వేయొచ్చు

Nov 1 2026 5:54 AM | Updated on Nov 1 2026 5:54 AM

You can vote with any of these identity cards

ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ 

సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న వారు ఓటరు స్లిప్‌ లేదా ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సూచించిన ఏదో ఒక గుర్తింపు కార్డును అధికారులకు చూపి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జారీ చేసింది. ఓటరు స్లిప్‌ లేదా ఓటరు గుర్తింపు కార్డులకు ప్రత్యామ్నాయంగా 20 రకాల గుర్తింపు కార్డులను ఆ జాబితాలో పేర్కొంది. 

అవి..  
1) ఆధార్‌ కార్డు   2) పాస్‌పోర్ట్‌   3) డ్రైవింగ్‌ లైసెన్స్‌ 4) పాన్‌ కార్డు 5) రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు లేదా పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ కార్డులు 6) ఫొటోలతో కూడిన పెన్షన్‌ పత్రాలు, మాజీ సైనికుడి పెన్షన్‌ పుస్తకం 7) ఫొటోలతో కూడిన ఆస్తి పత్రాలు (పట్టాలు/పట్టాదారు పాస్‌బుక్‌లు/రిజిస్టర్డ్‌ డీడ్‌లు మొదలైనవి) 8) ప్రభుత్వ రంగ బ్యాంకులు, పోస్టాఫీసులు, అప్కాబ్‌ బ్యాంకులు జారీ చేసిన పాస్‌బుక్‌లు, కిసాన్‌ పాస్‌బుక్‌లు 9) బ్యాంకులు జారీ చేసిన ఫొటోలతో కూడిన ఏటీఎం కార్డులు 10)  ఫొటోలతో కూడిన రేషన్‌ కార్డులు  11) జాతీయ జనాభా రిజిస్టర్‌ ఎన్‌పీఆర్‌ పథకం కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌ కార్డులు 12) ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డ్‌ 13) అధీకృత అధికారి జారీ చేసిన ఫోటోలతో కూడిన ఎస్టీ, ఎస్సీ, బీసీ సర్టిఫికెట్లు 14) ఫొటోతో కూడిన స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డులు 15) ఫొటోతో కూడిన ఆయుధ లైసెన్సులు 16) ఫొటోతో కూడిన శారీరక వైకల్య ధృవీకరణ పత్రం 17) బార్‌ కౌన్సిల్‌లు జారీ చేసిన ఫొటోలతో కూడిన సభ్యత్వ కార్డులు  18) కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేసిన ఫొటోలతో కూడిన ఆరోగ్య బీమా పథకం స్మార్ట్‌ కార్డులు  19) శాసన సభ , శాసన మండలి సచివాలయం ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన ఫొటోలతో కూడిన గుర్తింపు కార్డులు 20) లోక్‌సభ , రాజ్యసభ సచివాలయం ద్వారా పార్లమెంట్‌ సభ్యులకు జారీ చేసిన ఫొటోలతో కూడిన గుర్తింపు కార్డులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement