సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిపై దాడి చేశారు. బూత్ నెం. 21 వద్ద ప్రమీలమ్మపై దాడికి పాల్పడ్డారు. వైఎస్ ప్రమీలమ్మ వాహనాన్ని టీడీపీ రౌడీలు ధ్వంసం చేశారు. కర్రలతో టీడీపీ గూండాలు బహిరంగంగా తిరుగుతున్న పచ్చమూకలు.. పులివెందుల బూత్ 38 వద్ద కర్రలతో హల్‌చల్ చేశారు. పులివెందుల బూత్ నెం. 17 వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డగించి రిగ్గింగ్‌కు కుట్ర
పోలింగ్ బూత్‌ల వద్ద టీడీపీ నేతలు తిష్ట వేశారని.. పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ ప్రమీలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిని నన్నే అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డగించి రిగ్గింగ్‌కు కుట్రకు తెరతీశారంటూ ఆమె మండిపడ్డారు.
కడపలో పచ్చమూకల అరాచకాలు
కడపలో పచ్చమూకల అరాచకాలు కొనసాగుతున్నాయి. కడప ఉమెన్స్ కాలేజీ వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీసులు అడ్డగించారు. పోలింగ్ కేంద్రంలోకి ఏజెంట్లను పోలీసులు అనుమతించలేదు. ఏజెంట్లను అడ్డుకోవడంపై మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప 8వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల ఫామ్‌లను టీడీపీ గూండాలు చించివేశారు. టీడీపీ రౌడీలు హల్‌చల్ చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
ఇదీ చదవండి: వెన్నుపోటుకు ఓటా?


