ఎన్టీఆర్ జిల్లా: వత్సవాయి మండలంలో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. దబ్బాకుపల్లి, పోలంపల్లి, వత్సవాయి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఎన్నికల ఏజెంట్లను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై పోలీస్ స్టేషన్ వద్ద సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరావు, వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. మండలంలో వైఎస్‌ఆర్సీపీ అనుకూలంగా ఓటింగ్ జరుగుతూ ఉండటంతో, పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి శ్రేణులు అరాచకాలకు దిగుతున్నాయి.
ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి పోలింగ్ స్టేషన్ వద్ద పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదినికి దిగారు. పోలింగ్ బూత్‌లోకి కారును అనుమతివ్వాలని పోలీసులతో గొడవపడ్డారు. ఐదు నిమిషాల్లో నీ ఉద్యోగం తీసేపిస్తా అంటూ టీడీపీ నేతలు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. విస్సన్నపేట మండలం కలగరలో ఎన్నికల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఏజెంట్‌ను టీడీపీ నేత నెట్టేశాడు. వైసీపీ నాయకులతో టీడీపీ శ్రేణుల వాగ్వాదానికి దిగాయి. పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నాయకుల తీరుతో పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం ఏర్పడింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల ప్రయత్నించారు.


