సాక్షి, పులివెందుల: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, ఏజెంట్లపై దాడులు చేస్తున్నారు. పోలింగ్ వద్ద పెట్రోల్ బాంబులు విసురుతూ అరాచకం సృష్టించారు. మరికొన్ని చోట్ల టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేయడంతో అసలైన ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఖంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
పులివెందుల మండలం ఎర్రిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ రౌడీలు పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయారు. పోలింగ్ బూత్‌ల దగ్గర పెట్రోల్ బాంబులు వేయడంతో భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
అలాగే, పులివెందుల మండలం కణంపల్లిలో మీ ఓట్లు అయిపోయాయి అని పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లకు పోలింగ్ సిబ్బంది చెప్పడంతో వారంతా ఖంగుతున్నారు. ఈ నేపథ్యంలో మా ఓట్లు ఎవరు వేస్తారంటూ ఓటర్లు తిరగబడ్డారు. దీంతో పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
పులివెందుల : పులివెందుల మండలం కణంపల్లి లో మీ ఓట్లు అయిపోయాయి అని చెప్తున్న పోలింగ్ సిబ్బంది. మా ఓట్లు ఎవరు వేస్తారంటూ తిరగబడిన ఓటర్లు #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu https://t.co/mToakh5hfr
— YSR Congress Party (@YSRCParty) November 5, 2026
సీసీ కెమెరాలు ఆఫ్..
ఇదిలా ఉండగా.. పులివెందుల మండల పరిధిలో 19 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటిలో 5 మాత్రమే ఆన్‌లైన్‌లో ఉన్నాయి. మిగిలినవి ఆఫ్‌లైన్‌లో ఉండటం గమనార్హం. ఇక, ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1200 సీసీ కెమెరాలు ఆఫ్‌లైన్‌లో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఆఫ్‌లైన్‌లో రికార్డు అయితే ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆన్‌లైన్‌లో రికార్డు అయితే ఎడిటింగ్‌కు అవకాశం ఉండదు. ఈ కారణంగా సీసీ కెమెరాలు ఆఫ్‌లైన్‌లో ఉంటే రిగ్గింగ్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది.
రైల్వేకోడూరు, పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లిలో టీడీపీ రౌడీలు పెట్రోల్ బాంబులు వేసి విధ్వంసం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే పెట్రోలో బాంబులతో టీడీపీ రౌడీలు దాడులను తెగబడ్డారు. నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు విసురుతూ రెచ్చిపోయారు. దీంతో, టీడీపీ గూండాల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పలువురు గాయపడ్డారు.
పులివెందులలో పెట్రోల్ బాంబులతో టీడీపీ దాడులు ఎర్రిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పోలింగ్ బూత్‌ల దగ్గర పెట్రోల్ బాంబులు వేయడంతో భారీ మంటలు https://t.co/oT4L5tUWnM
— Telugu Feed (@Telugufeedsite) November 5, 2026
ఇదీ చదవండి: డీఎస్పీ మురళీ నాయక్ ఓవరాక్షన్.. అవినాష్ రెడ్డి సీరియస్!
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లలో దొంగ ఓట్లు వేయిస్తూ అడ్డంగా దొరికిపోయిన టీడీపీ! క్యూ లైన్లలో ఉన్న అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించిన వైయస్ఆర్సీపీ నేతలు. దాంతో తమను టీడీపీ వాళ్లే ఓట్లు వేయించేందుకు పిలిచారని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయిన యువకులు. వారిని కనీసం అదుపులోకి తీసుకోకుండా విచారణ చేస్తున్నట్లు నాటకమాడి అక్కడి నుంచి పంపించేసిన పోలీసులు! #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
— YSR Congress Party (@YSRCParty) November 5, 2026


