కుప్పంలో టీడీపీ గూండాల బీభత్సం | TDP goons wreak havoc in Kuppam | Sakshi
Sakshi News home page

కుప్పంలో టీడీపీ గూండాల బీభత్సం

Nov 5 2026 9:31 AM | Updated on Nov 5 2026 9:31 AM

కుప్పం: చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీ గూండాలు బీభత్సం సృష్టిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌లకు కబ్జా చేసి, దౌర్జన్యాలకు దిగుతున్నారు.  చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నది. శాంతిపురం మండలంలోని శివరామపురం గ్రామంలో మాజీ వైస్ ఎంపిపి రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల రోజు వైసీపీ నేత రమేష్ ను అదుపులోకి తీసుకోవడంపై వైఎస్‌ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. వైఎస్‌ఆర్సీపీ నేతలు, అభ్యర్థులను, ఏజెంట్లను అదుపులోకి తీసుకొని పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రామకుప్ప మండలం బందార్లపల్లి పంచాయతీ బూత్ నెంబర్ 14, 15 కంచి దాసనపల్లి,లింగాపురం, వైసీపీ తరఫున ఏజెంట్లుగా వెళ్లిన మహేష్, సోమశేఖర్ ఇద్దరినీ ఈ టీడీపీ గూండాలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. బలవంతంగా  వారిని పోలింగ్ బూత్ నుండి  టీడీపీ గుండాలు బయటకు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement