నంద్యాల(అర్బన్): నంద్యాల మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. బలిజ సామాజిక వర్గంతో పాటు ఇతర వర్గాలు తమ పార్టీ వెంట ఉన్నాయంటూ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చెబుతున్న గొప్పలు నంద్యాల మునిసిపాలిటీలో పారలేదు. మొత్తం 52 వార్డుల్లో ఏడు వార్డుల్లో జనసేన అభ్యర్థులు కేటాయించాలని కోరగా కేవలం రెండు స్థానాలు ఇచ్చారు. పోటీ చేసి 17వ వార్డులో రాచమడుగు లక్ష్మిదేవి, 41వ వార్డులో పిడతల సుధాకర్ ఓటమి పాలయ్యారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిస్తే టీడీపీకి అనుకూలంగా ప్రకటన
డోన్: పట్టణంలోని 7వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రుక్సానా టీడీపీకి చెందిన సమీప ప్రత్యర్థి పఠాన్ ఖైరున్నీసాపై మూడు ఓట్లతో గెలిచినట్లు మొదట రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. తిరిగి గంట తర్వాత రీకౌంటింగ్ జరిపి ఇదే ప్రకటన చేశారు. ఈ మేరకు ఎన్నికల కౌంటింగ్ అధికారి సంతకం కూడా చేశారు. అయితే గంట తర్వాత బయట ఉన్న డిస్‌ప్లేపై టీడీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించారు.
ఈ విషయమై బుధవారం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రుక్సానా విలేకరులతో మాట్లాడారు. తనకు 451 ఓట్లు రాగా తన ప్రత్యర్థికి 448 ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఈ విషయంపై తాను న్యాయవాదులతో రిటర్నింగ్ అధికారిని కలిసేందుకు ప్రయతి్నస్తే ఆయన మొత్తం ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరమే రీకౌంటింగ్ చేస్తామని చెప్పారన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి రీకౌంటింగ్ నిర్వహించకుండా తనకు అన్యాయం చేశారని ఆమె విలపించారు. ఈ ఫలితంపై న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తునట్లు తెలిపారు.


