లక్కవరంలో అరుదైన పుంగనూరు జాతికి చెందిన 12 అంగుళాల ఎత్తు ఉన్న ఆవు దూడ ఆకట్టుకుంటోంది. గ్రామానికి చెందిన బోణం కాశీ ఈ పుంగనూరు దూడకు ‘మహాలక్ష్మి‘ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా సాకుతున్నారు. ఈ దూడను పలువురు రూ.3 లక్షలకు అడిగారని, విక్రయించే ఉద్దేశం లేదని కాశీ తెలిపారు. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఆసక్తిగా వస్తున్నారు. - మలికిపురం


