వేర్వేరు పెళ్లిళ్లయినా.. వీడని ప్రేమబంధం! | Eluru Love Couple Incidnrt | Sakshi
Sakshi News home page

వేర్వేరు పెళ్లిళ్లయినా.. వీడని ప్రేమబంధం!

Oct 13 2026 9:23 AM | Updated on Oct 13 2026 9:32 AM

Eluru Love Couple Incidnrt

కొండేటి కిషోర్‌, గూడూరి తేజశ్రీ గంగా మహాలక్ష్మి

ఏలూరు జిల్లా: లేత వయసులో చిగురించిన ప్రేమ అది. వేర్వేరుగా పెళ్లిళ్లయి ఏళ్లు గడిచినా ఆ బంధం వీడలేదు. వారి ప్రవర్తనపై పెద్దలు హెచ్చరించడంతో, ఇక కలసి జీవించలేమని భావించి కలుపు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన పెనుగొండ మండలంలో చోటుచేసుకుంది. పెనుగొండ ఎస్సై గంగాధర్‌ తెలిపిన వివరాల ప్రకారం... 

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన కొండేటి కిషోర్‌ (31), గూడూరి తేజశ్రీ గంగా మహాలక్ష్మి (36) చిన్నతనంలోనే ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడం, ఇతర కారణాల వల్ల వీరి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో వివాహాలు జరిపించారు. కిషోర్‌కు కాకరపర్రుకు చెందిన కుమారితో వివాహమవగా ఒక బాబు ఉన్నాడు. తేజశ్రీకి తణుకు పరిధిలోని టీ.వేమవరానికి చెందిన నాగరాజుతో వివాహం జరగగా, వీరికి 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. 

వివాహాలై పిల్లలు పుట్టినా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగింది. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు ఇటీవల ఇద్దరినీ తీవ్రంగా హెచ్చరించారు. తమను ఇక కలవనివ్వరని భావించిన వీరు, ఈ నెల 10న ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. పెనుగొండ మండలం కామధేనువులంకకు చేరుకుని ఆదివారం కలుపు మందు తాగి, బంధువులకు ఫోన్‌ చేసి చెప్పారు. వెంటనే బంధువులు 108 వాహనంలో వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలిచారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కిషోర్, సాయంత్రం తేజశ్రీ మృతి చెందారు. వీరి మృతితో నాలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement