అత్యుత్తమ ‘గుడ్డు’ వంటకాలుగా మసాలా అమ్మెట్‌, ఎగ్‌ బుర్జీ..! | Omelette, Anda Bhurji Make It Worlds 50 Best Egg Dishes List | Sakshi
Sakshi News home page

అత్యుత్తమ ‘గుడ్డు’ వంటకాలుగా మసాలా అమ్మెట్‌, ఎగ్‌ బుర్జీ..!

Nov 20 2026 1:33 PM | Updated on Nov 20 2026 1:52 PM

Omelette, Anda Bhurji Make It Worlds 50 Best Egg Dishes List

అత్యుత్తమ గుడ్డు వంటకాల జాబితాలో మన భారతీయ వంటకాలు రెండు చోటు దక్కించుకున్నాయి. టేస్ట్‌ అట్లాస్‌ ఇటీవల ప్రపంచంలో 50 అత్యుత్తమ గుడ్డు వంటకాల జాబితాను విడుదల చేసింది. ఆ జాబిలో భారత్‌కి సంబంధించి రెండు రెసిపీలు స్థానం దక్కించుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా గుడ్డు చాలామందికి అల్పాహారం కూడా. కాకపోతే వాటి రుచులు, వంటకాలు ఒక్కో విధంగా ఉంటాయి. 

కొన్నింటిని కొద్ది మసాలాలతో చేయగా, మరికొన్ని కూరగాయలు, స్థానిక రుచులతో మేళవిస్తారు. ఆ 50 అత్యుత్తమ గుడ్డు వంటకాల జాబితాలో ..భారత్‌లో విరివిగా, ఎక్కుమంది ఇష్టపడే మసాలా ఆమ్లెట్‌ 20వ స్థానం దక్కించుకోగా, అండా బుర్జీ 34వ స్థానం దక్కించుకున్నాయి. జపాన్‌కు చెందిని అజిత్సుకే తమగో తొలి స్థానం దక్కించుకోగా, ఆ తర్వాత గ్రీస్‌కు చెందిన స్ట్రాపట్సాడా, స్పెయిన్‌కు చెందిన టోర్టిల్లా డి బెటాంజోస్‌లు రెండో స్థానం దక్కించుకున్నాయి. 

ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఎగ్స్‌ బెనెడిక్ట్‌, టర్కీకి చెందిన మెనమెన్‌, జపాన్‌కు చెందిన చవాన్‌ముషి, మెక్సికోకు చెందిన హ్యూవోస్‌ రాంచెరోస్‌ వంటి వంటకాలు కూడా ఉన్నాయి. కాగా మసాలా ఆమ్మెట్‌ జస్ట్‌రెండు నిమిషాల్లో తయారువుతుంది. పావ్‌తో కలిపి మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌గా తరుచుగా తింటుంటారు. 

ఇక అండా బుర్జీ ముంబై స్ట్రీట్‌ వంటకం స్టైల్‌లో చేసే విధానమే ఈ జాబితాలో స్థానం దక్కించుకుంది. దీన్ని అక్కడ ఉల్లిపాయలు, టమోటాలు, మసాలాలు కలిపి చేస్తారు. దీన్ని కూడా పావ్‌ లేదా టోస్ట్‌తో చేసిన బ్రెడ్‌తో ఆస్వాదించొచ్చు.

 

ఇదీ చదవండి: ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే ఏడు మారథాన్‌లు..! ఆఖరికి ఎనిమిదో నెలలో కూడా..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement