breaking news
Asian Paints
-
ఏషియన్ పెయింట్స్‌పై విచారణకు సీసీఐ ఆదేశం
న్యూఢిల్లీ: డెకొరేటివ్ పెయింట్ల తయారీ, విక్రయ మార్కెట్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ ఏషియన్ పెయింట్స్‌పై వస్తున్న ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణకు ఆదేశించింది. 90 రోజుల వ్యవధిలో నివేదికను సమరి్పంచాలని డైరెక్టర్ జనరల్‌కు సూచించింది.డెకొరేటివ్ పెయింట్స్ విభాగంలో కొత్త సంస్థల రాకుండా అడ్డుకుంటూ, పరిశ్రమ వృద్ధి అవరోధాలు సృష్టించే విధానాలు పాటిస్తోందంటూ ఏషియన్ పెయింట్స్‌పై గ్రాసిం ఇండస్ట్రీస్ (బిర్లా పెయింట్స్ డివిజన్) చేసిన ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. గ్రాసింలాంటి పోటీ సంస్థలతో లావాదేవీలు జరపకుండా డీలర్లకు ఆంక్షలు విధించడం, ముడి సరుకులు..సేవలు అందించకుండా నిరోధించడంలాంటి అంశాలు చూస్తే కొత్త సంస్థలను మార్కెట్లోకి రాకుండా ఆటంకాలు కల్పించడంతో పాటు మార్కెట్లో పోటీపై ఏషియన్ పెయింట్స్ ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోందని సీసీఐ పేర్కొంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగమైన గ్రాసిం గతేడాది ఫిబ్రవరిలో ’బిర్లా ఓపస్ పెయింట్స్’ పేరిట డెకొరేటివ్ పెయింట్స్ విభాగంలోకి ప్రవేశించింది. -
పెయింటర్స్‌కు గుర్తింపు ఇస్తున్న ప్రోగ్రామ్..
ప్రతి మనిషి తన జీవితాన్ని రంగులమయం చేసుకోవాలనుకుంటారు. అందుకు సరైన అవకాశం రావాలి. అయితే అలాంటి అవకాశాలు వాటంతటవే వస్తాయని కూర్చుంటే మాత్రం ఎప్పటికీ విజయం వరించదు. జీవితంలో కెరియర్ పరంగా ఎదిగేందుకు వచ్చే ప్రతి మలుపును అవకాశంగా మలుచుకోవాల్సిందే. వివిధ రంగులను కలబోసి ప్రత్యేక రంగులు సృష్టించేవారికి మార్కెట్లో డిమాండ్ ఉంది. అందుకు కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా పెయింటర్లకు శిక్షణ ఇస్తున్నాయి. వాటిని తన జీవితంలో ఎదిగేందుకు అవకాశంగా మలుచుకున్నవారిలో విశాఖపట్నానికి చెందిన గణిరాజు సిరిపురం ఉన్నారు. అందుకు ప్రముఖ పెయింట్ కంపెనీ ఏషియన్ పెయింట్స్ అందించిన ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు. ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ ద్వారా చాలా మందికి శిక్షణ ఇస్తోంది. ఇందులో రంగుల కలయికతో ప్రదేశానికి తగినట్లుగా, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎలాంటి రంగులు తయారు చేయాలో, ఎలాంటి డిజైన్లను ఇష్టపడుతున్నారో వంటి అంశాలను తెలియజేస్తూ ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెన్సీ (ఐడీసీ) వంటి ఆధునిక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో గణిరాజు సిరిపురం ‘కామ్యాబీ కే రంగ్’ సీజన్ 6లో ప్రతిభ కనబరిచారు.పాఠాలు నేర్చుకున్నారు.. జీవితాలు మార్చుకున్నారు..గణిరాజు ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కంపెనీ తెలిపింది. ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ ద్వారా పాఠాలు నేర్చుకొని తమ జీవితాలను మార్చుకున్న కాంట్రాక్టర్ల స్ఫూర్తిదాయక కథలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. సీజన్ 6లో గణిరాజు ప్రతిభ కనబరిచినట్లు తెలిపింది. ఇప్పటివరకు వివిధ సీజన్‌ల్లో ఢిల్లీకి చెందిన జునైద్ కాజ్మీ, గుజరాత్‌లోని మధపార్కు చెందిన అమృత్ బెన్, వారణాసి నుంచి బంటి బింద్ ముందువరుసలో ఉన్నారని చెప్పింది.కుటుంబ పోషణకు పెయింటింగ్ వైపుఏషియన్ పెయింట్స్ ప్లాట్‌ఫాం ద్వారా సంస్థ లక్షల మందికి ప్రేరణ ఇస్తుందని కంపెనీ తెలిపింది. వారిలో విశాఖపట్నంకు చెందిన గణిరాజు సిరిపురం ఒకరు. పట్టుదలతో తన జీవితాన్ని విజయగాథగా మార్చుకున్న ఆయనకు చిన్నప్పటి నుంచి చదువుపై మక్కువ ఎక్కువ. కానీ పేదరికంలో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి బాధపడుతున్న తండ్రిని చూసి తన కలలను పక్కన పెట్టారు. కుటుంబాన్ని ఆదుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో కుటుంబ పోషణ కోసం పెయింటింగ్ వేసేవారు. ఈ క్రమంలో వైవిధ్యంగా పెయింటింగ్ వేస్తూ తానకంటూ ప్రత్యేకంగా గుర్తింపు పొందారు.పని పట్ల గౌరవం.. జీవితంపై స్పష్టత..కాలక్రమేణా కస్టమర్ల అంచనాలు పెరుగుతున్న కొద్దీ తనను తాను మెరుగుపరచుకోవాలన్న ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ గురించి తెలుసుకున్నారు. ఈ ప్లాట్‌ఫాం ద్వారా ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెన్సీ (ఐడీసీ) వంటి ఆధునిక శిక్షణ పొందారు. ఈ శిక్షణతో తనలో ఆత్మవిశ్వాసంతో పాటు పని పట్ల గౌరవం, జీవితంపై స్పష్టత వచ్చింది. ఈ ప్రోగ్రామ్‌లో మెలకువలు నేర్చుకుని వినియోగదారుల మన్ననలు పొందుతున్నారు. ఇప్పుడు గణిరాజు కేవలం పెయింటర్ మాత్రమే కాదు. ఒక కళాకారుడిగా తన కెరియర్లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తన పనికి ఒక గుర్తింపు ఉంది. ఈ వృత్తిలో ఆయన నైపుణ్యం కలిగిన వ్యక్తిగా స్థిరపడ్డారు. సరైన అవకాశం దొరికితే ఎటువంటి కష్టం వచ్చినా జీవితాన్ని రంగులమయం చేసుకోవచ్చని తన కథ చెబుతోంది.ఇదీ చదవండి: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలుఎంతో మందికి స్ఫూర్తిదాయకంఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమిత్ సింగిల్ మాట్లాడుతూ ‘కామ్యాబీ కే రంగ్ అనేది సాధారణ క్యాంపెయిన్ మాత్రమే కాదు. వ్యక్తుల విజయాలను స్మరించుకునే ఒక ఉత్సవం. సాధారణ జీవితం సాగించే పెయింటర్లు కంపెనీ ప్రోగ్రామ్ ద్వారా సమాజంలో ఎదగడం చూస్తున్నాం. ఈ ప్రయాణం మాకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. ఇప్పటివరకు 21 లక్షలకు పైగా ట్రైనింగ్ సెషన్లు నిర్వహించింది. ఈ శిక్షణలోని పెయింట్ అప్లికేషన్, వాటర్ప్రూఫింగ్, ఉడ్ ఫినిషెస్, మెషినరీ వాడకం, కస్టమర్ సర్వీస్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్ని 79 శాతం మంది తమ ఆదాయాన్ని పెంచుకున్నారు. 88 శాతం మంది తమ పనిలో మెరుగయ్యారు. 86 శాతం మందికి సామాజిక గౌరవం లభించింది’ అన్నారు. -
రూ. 11140 కోట్ల షేర్ అమ్మేస్తున్న రిలయన్స్
ముంబై: దేశీ పెయింట్స్ దిగ్గజం ఏషియన్ పెయింట్స్‌లో తనకున్న 4.9 శాతం వాటాలను విక్రయించడంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ వాటా విలువ దాదాపు రూ. 11,140 కోట్లుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఏకమొత్తంగా ఒకేసారి లేదా పలు డీల్స్ ద్వారానైనా ఈ లావాదేవీని నిర్వహించేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీవోఎఫ్‌ఏ)ను నియమించుకున్నట్లు సమాచారం.అయితే, ప్రస్తుత మార్కెట్ ధర కంటే డిస్కౌంట్‌కే ఆఫర్లు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎప్పుడో 17 ఏళ్ల క్రితం 2008 జనవరిలో రిలయన్స్ ఈ వాటాలను రూ. 500 కోట్లతో కొనుగోలు చేసింది. దానితో పోలిస్తే ప్రస్తుత ధర ప్రకారం దాదాపు 24 రెట్లు లాభాన్ని కంపెనీ అందుకోనుంది.పెయింట్స్ పరిశ్రమలో పోటీ తీవ్రం కావడంతో ఏషియన్ పెయింట్స్ మార్కెట్ వాటా గత ఆర్థిక సంవత్సరం 59 శాతం నుంచి 52 శాతానికి తగ్గింది. అలాగే గత ఏడాది వ్యవధిలో షేరు విలువ సుమారు 19 శాతం పైగా క్షీణించింది. దేశీయంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న ఏషియన్ పెయింట్స్ అంతర్జాతీయంగా 8వ స్థానంలో ఉంది. 15 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. -
ఏషియన్ పెయింట్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 45 శాతం క్షీణించి రూ. 701 కోట్లకు పరిమితమైంది. డిమాండ్ తగ్గడంతోపాటు, పోటీ తీవ్రత ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,275 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం రూ. 8,731 కోట్ల నుంచి రూ. 8,359 కోట్లకు స్వల్పంగా(4 శాతం) వెనకడుగు వేసింది. మొత్తం వ్యయాలు రూ. 7,277 కోట్లుగా నమోదయ్యాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 20.55 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. విదేశీ అమ్మకాలు వీక్ క్యూ4లో ఇతర ఆదాయంతో కలిపి ఏషియన్ పెయింట్స్ మొత్తం టర్నోవర్ 5 శాతం తక్కువగా రూ. 8,459 కోట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయాలు 2 శాతం నీరసించి రూ. 800 కోట్లకు పరిమితమయ్యాయి. ఇథియోపియా, ఈజిప్్టలలో కరెన్సీ విలువ క్షీణించడం, బంగ్లాదేశ్‌లో ఆర్థిక సవాళ్లు ఇందుకు కారణమైనట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 1.3 శాతం బలహీనపడి రూ. 2,303 వద్ద ముగిసింది. -
పడిపోయిన ఏషియన్ పెయింట్స్ లాభం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 44 శాతం క్షీణించి రూ. 694 కోట్లకు పరిమితమైంది.డిమాండ్ మందగించడం, ముడివ్యయాల పెరుగుదల, డెకొరేటివ్, కోటింగ్ బిజినెస్ క్షీణించడం ప్రభావం చూపాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,232 కోట్లకుపైగా ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 4.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. మొత్తం అమ్మకాలు సైతం 5 శాతం నీరసించి రూ. 8,028 కోట్లకు చేరాయి. గత క్యూ2లో రూ. 8,479 కోట్ల టర్నోవర్ సాధించింది.అయితే మొత్తం వ్యయాలు స్వల్పంగా 1 శాతం పెరిగి రూ. 7,093 కోట్లను దాటాయి. ఇతర వనరులతో కలిపి మొత్తం ఆదాయం 5 శాతం తక్కువగా రూ. 8,201 కోట్లను తాకింది. కాగా.. అంతర్జాతీయ అమ్మకాలు నామమాత్ర క్షీణతతో రూ. 770 కోట్లకు పరిమితమయ్యాయి. గత క్యూ2లో సాధించిన రూ. 40 కోట్ల పన్నుకుముందు లాభం(పీబీటీ)స్థానే రూ. 22 కోట్ల నష్టం ప్రకటించింది. -
ఏషియన్ పెయింట్స్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 574 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 220 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 91 శాతం జంప్‌చేసి రూ. 5,585 కోట్లను తాకింది. గతేడాది క్యూ1లో రూ. 2,923 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. మొత్తం వ్యయాలు 26 శాతం పెరిగి రూ. 1,006 కోట్లకు చేరాయి. దేశీయంగా డెకొరేటివ్ బిజినెస్ అమ్మకాల పరిమాణం రెట్టింపైనట్లు ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. గతేడాది క్యూ1లో దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఆదాయం పడిపోయినట్లు ప్రస్తావించారు. షేరు దూకుడు... ఫలితాల నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 3,145 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,179ను అధిగమించడం ద్వారా 52 వారాల గరిష్టానికి చేరింది. బీఎస్ఈలోనూ ఇదే స్థాయిలో ఎగసింది. ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈలో 67.55 లక్షలు, బీఎస్ఈలో 2.62 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. -
కొత్త టెక్నాలజీతో వాటర్ ప్రూఫింగ్ చేయండిలా..
సొంతింటి కలలకు వాటర్ లీకేజీ సమస్యలు. వాటర్ లీకేజీ, సీపేజీలతో పాడవుతున్న ఫాల్స్ సీలింగ్. లీకేజీ సమస్యల కారణంగా దెబ్బతింటున్న గోడల నాణ్యత. వాటర్ ప్రూఫింగ్‌తో లీకేజీ సమస్యలకు చెక్. మార్కెట్లో అందుబాటులో వాటర్ ప్రూఫ్ సొల్యూషన్స్. హైదరాబాద్ : సొంత ఇళ్లు అనేది మధ్య తరగతి ప్రజల కలల సౌధం. నెలనెల పొదుపు చేసో లేదా హోం లోన్లు తీసుకునో చెమటోడ్చి ఇంటిని నిర్మించుకుంటారు. అంతేకాదు లక్షలు వెచ్చించి ఇంటిలోపల ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటారు. ఇంటికి వచ్చిన గెస్టుల అభినందనలు అందుకునేలా నేటికి ట్రెండ్‌కి తగ్గట్టు ఫాల్స్ సీలింగ్ కూడా చేయిస్తున్నారు. అయితే వాతావరణ మార్పులు, చిన్న చిన్న లోపాల కారణంగా వర్షకాలం వచ్చిందంటే చాలు చినుకు పడితే కొత్త సమస్యలు తలెత్తుతుంటాయి. సాధారణంగా రూఫ్ వాలుగా కాకుండా చదునుగా ఉండే విధంగానే ఎక్కువ మంది ఇళ్లను నిర్మిస్తారు. రూఫ్ చదునుగా ఉండటం వల్ల అక్కడక్కడ నీరు నిలిచిపోయి సీపేజ్‌లు వస్తుంటాయి. పైగా ఎండ, చలి, వానల కారణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల లీకేజీలు ఏర్పడుతుంటాయి. వానాకాలంలో వర్షకాలం వస్తే లీకేజీలు ఉన్న ఇళ్లలో పై కప్పు నుంచి నీరు కురవడం, చెమ్మ రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. లక్షలు వెచ్చించి కట్టుకున్న ఇంటికి , వాటర్ లీకేజీలు ఇబ్బంది పెడతాయి. ఇక ఇంటి పైకప్పుతో పాటు గోడలు కూడా చెమ్మ వస్తూ ఉంటుంది. ఈ చెమ్మ రావడం వల్ల ఇంటి గోడల ధృడత్వం దెబ్బతినడంతో పాటు ఎంతో ముచ్చటపడి ఇంటిలోపలి వైపు చేసుకున్న ఇంటీరియర్ కూడా పాడైతోంది. ఫాల్స్ సీలింగ్‌కి మరకలు కూడా వస్తుంటాయి. ఈ సమస్యలకు చెక్‌పెట్టడం ఇప్పుడు ఎంతో ఈజీ. వాటర్ ప్రూఫింగ్ ఇంటి పైకప్పు నుంచి లీకేజీ, చెమ్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందస్తుగా వాటర్ ప్రూఫింగ్ చేయించడం ఉత్తమం. గతంలో వాటర్ ప్రూఫింగ్ చేయాంటే అయితే మోర్టారు సున్నం వేయడం లేదంటే డాంబర్ షీట్లు పరిచేయడం అనే పద్దతులే అందుబాటులో ఉండేవి. అయితే వీటి మన్నిక తక్కువ కావడంతో సమస్య మళ్లీ తిరగబెడుతుంది. ఈ సమస్యకు తెర దించుతూ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అధునాతన వాటర్ ప్రూఫింగ్ పద్దతులు అందుబాటులోకి వచ్చాయి, గోడలకు పెయింట్ వేసినంత సుళువుగా వాటర్ ప్రూఫింగ్ చేసుకోవచ్చు. తద్వారా వాటర్ లీకేజీ సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. రూఫ్ వాటర్ ప్రూఫింగ్ సిమెంట్‌కు కొన్ని రసాయనాల మిశ్రమాలను కలిపి, కొత్త రకం వాటర్ ప్రూఫింగ్ పద్దతులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇంటి పైకప్పుకు వేయడం ద్వారా లీకేజీ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అయితే రసాయనాల నాణ్యతపై ఆధారపడి ఈ ప్రూఫింగ్ మన్నిక ఉంటుంది. ముఖ్యంగా ఆక్రిలిక్ రసాయనం కలిపిన వాటర్ ప్రూఫ్ సిమెంట్ తో ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. ఇక ఏషియన్ పెయింట్ అయితే ఆక్రిలిక్ రసాయనంతో పాటు ‘ఫైబర్’ కంటెంట్‌తో కూడిన సిమెంట్‌ని రూపొందించింది. వీటిని డాంప్ ప్రూఫ్, డాంప్ ప్రూఫ్ ఆల్ట్రా పేరుతో వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్‌గా అందిస్తోంది. పైగా వీటితో వాటర్ ప్రూఫింగ్ చేసుకోవడం చాలా సులువు. ఇదీ పద్దతి ముందుగా టెర్రస్ లేదా ఇంటి పైకప్పు వెలుపలి భాగాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత పగుళ్లు, గ్యాప్‌లు వచ్చిన చోటంతా ఆక్రిల్ మ్యాక్స్ క్రాక్ సీల్‌తో పూడ్చేయాలి. అప్పటికే ఏదైనా పుట్టీ, లేదా పెయింట్ వేసి ఉంటే దాన్ని కూడా తొలగించాలి. ఆ తర్వాత మొదటి కోటింగ్‌గా డాంప్ప్రూఫ్ / డాంప్ప్రూఫ్ ఆల్ట్రా లాంటి వాటర్ ప్రూఫింగ్ సొల్యుషన్ని ఒక లేయర్‌గా వేయాలి. ఆ కోటింగ్‌ని 4 నుంచి 6 గంటల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత డాంప్ప్రూఫ్ అంచుల చుట్టూ రూఫ్ టేప్‌ని వేయాలి. మరోసారి రెండో కోటింగ్‌గా డాంప్ప్రూఫ్ / డాంప్ప్రూఫ్ ఆల్ట్రా వాటర్ ప్రూఫింగ్ సొల్యుషన్ వేయాలి. మరోసారి 4 నుంచి 6 గంటల పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం ద్వారా పదేళ్ల పాటు వాటర్ లీకేజీ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఏసియన్ పెయింట్స్ అయితే ఏకంగా వారంటీనే అందిస్తోంది. (Advertorial) మరిన్ని వివరాల కోసం : Asian Paints Water Proofing Solutions