Rajasthan: రైల్వే ట్రాక్‌పై పేలుడు.. త్రుటిలో తప్పిన ప్రమాదం! | Blast On Rajasthan Railway Track Near Pakistan Border | Sakshi
Sakshi News home page

Rajasthan: రైల్వే ట్రాక్‌పై పేలుడు.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

Nov 4 2026 8:53 AM | Updated on Nov 4 2026 8:53 AM

Blast On Rajasthan Railway Track Near Pakistan Border

శ్రీగంగానగర్: రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో భారత్‌–పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించింది. అనూప్‌గఢ్‌–సూరత్‌గఢ్‌ రైల్వే మార్గంలోని 50 జీబీ ప్రాంతం వద్ద జరిగిన ఈ ఘటనలో పట్టాలకు మద్దతుగా ఉన్న రెండు సిమెంట్ స్తంభాలు, కొన్ని రైల్వే స్లీపర్లు దెబ్బతిన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో అనూప్‌గఢ్‌ నుంచి సూరత్‌గఢ్‌ వెళ్తున్న రైలు ఆ ప్రాంతాన్ని దాటిన దాదాపు 45 నిమిషాల తర్వాత పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం సుమారు 200 మీటర్ల దూరం వరకు వినిపించినట్లు సమాచారం. పట్టాల కింద దాదాపు రెండు అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది.

రంగంలోకి ఏటీఎస్‌.. భద్రతా బలగాలు
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్‌), రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌), నేర పరిశోధన విభాగం (సీఐడీ), డాగ్ స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ నిపుణులు, భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. ఇటీవల సరిహద్దు ప్రాంతంలో 7.5 కిలోల ఆర్డీఎక్స్‌ స్వాధీనం చేసుకున్న ఘటనతో తాజా పేలుడుకు సంబంధం లేదని శ్రీగంగానగర్‌ ఎస్పీ హరీశంకర్‌ స్పష్టం చేశారు. పేలుడుకు అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడే నిర్ధారించలేమని తెలిపారు. ఫోరెన్సిక్‌ బృందం ఆధారాలను పరిశీలించిన తర్వాతే స్పష్టత వస్తుందన్నారు. 

ఇదీ చదవండి: నీట్ పీజీ ప్రవేశాల్లో కీలక మార్పు.. ఇక పర్సంటైల్ ఉండదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement