లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపినట్లు వెల్లడి
సీఎం ఒమర్ అసమర్థ నేత అంటూ ధ్వజం
బుద్గామ్: నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ)కు రాజీనామా చేసినట్లు షియాల నేత, శ్రీనగర్ లోక్‌సభ సభ్యుడు సయ్యద్ ఆగా రుహుల్లా మెహ్‌దీ మంగళవారం ప్రకటించారు. ఆరి్టకల్ 370 పునరుద్ధరణ వంటి ఎన్నికల హామీలను ఎన్‌సీ నాయకత్వం నెరవేర్చలేకపోయిందని ఆయన విమర్శించారు. ఖైదీల విడుదల, ఉచిత విద్యుత్ హామీలను కూడా పక్కనపెట్టిందన్నారు. అందుకే, ఆ పార్టీలో ఇక ఏమాత్రం కొనసాగరాదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సీఎం ఒమర్‌ను ఆయన క్షేత్రస్థాయిలో సంబంధాలు లేని అసమర్థుడైన రాజకీయ నేతగా అభివర్ణించారు.
అధికార యావ తప్ప, హామీల అమలుపై ఆయనకు ఏమాత్రం శ్రద్ధ లేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్‌సీ పనిచేయలేకపోవడం తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. మంగళవారం తన తండ్రి ఆగా సయ్యద్ మెహ్‌దీ 26వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన గంటన్నరపాటు ప్రసంగించారు. ‘రాజీనామా లేఖను ఎన్‌సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాకు పంపించను. ఆయనకు ఆ లేఖ అందుకునే అర్హత లేదు. ఈ రాజీనామాతో మోసం, అవినీతి పూరిత పార్టీ నుంచి నాకు స్వేచ్ఛ లభించింది. ఈ రాజీనామా పత్రాన్ని మహ్మద్ అష్రాఫ్ మట్టూకు అందజేస్తున్నా.
సొంతంగా ఫరూక్ అబ్దుల్లాకు ఇవ్వాలని ఆయన్ను కోరుతున్నా’అని కరతాళ ధ్వనుల మధ్య ఆయన ప్రకటించారు. 2010లో నిరసనకారులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన టీనేజర్ తుఫాయిల్ మట్టూ తండ్రే అష్రాఫ్ మట్టూ. అప్పట్లో ఒమర్ కేబినెట్‌లో రుహుల్లా కేబినెట్ మంత్రిగా ఉన్నారు. కాగా, కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కూడా రుహుల్లా వెల్లడించారు. ర్యాలీ అనంతరం, రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు పంపించినట్లు తెలిపారు. ఎన్‌సీ టికెట్‌పై 2024 లోక్‌సభ ఎన్నికల్లో రుహుల్లా గెలిచారు. ఎన్‌సీ నాయకత్వంతో కొన్ని నెలలుగా కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


