ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండండి | Amit Shah Rahul Gandhi 2029-Election Defeat | Sakshi
Sakshi News home page

ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండండి

Oct 14 2026 4:21 AM | Updated on Oct 14 2026 4:21 AM

Amit Shah Rahul Gandhi 2029-Election Defeat

2029 ఎన్నికల్లో మట్టికరుస్తారు

రాహుల్‌ గాంధీ సారథ్యంపై బీజేపీ అగ్రనేత అమిత్‌ షా వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఎన్ని ఉద్యమాలు చేసినా దేశ ప్రజలు బీజేపీ, ఎన్‌డీఏ, ప్రధాని మోదీ వెంటే ఉన్నారని, రాహుల్‌గాంధీ సారథ్యంలో కాంగ్రెస్‌ మరోమారు లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. సీఈసీ జ్ఞానేశ్‌ రాజీనామా డిమాండ్‌లు వెల్లువెత్తాక తొలిసారిగా అమిత్‌ షా తాజా ఉద్యమాలపై స్పందించారు. మంగళవారం షా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘రాహుల్‌జీ, ఆయన మిత్రపక్ష భాగస్వాములకు ఒక విషయం చెప్పదల్చుకున్నా.

2029లో మీరంతా దారుణమైన ఓటమిని చవిచూసేందుకు సిద్ధంగా ఉండండి. 2029 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీతో గెలవబోతోంది. కాంగ్రెస్‌ వరసగా నాలుగోసారి ఓటమి కూపంలో కూరుకుపోనుంది. దేశ ప్రజలంతా మోదీ, బీజేపీ, ఎన్‌డీఏ వెన్నంటే ఉన్నారు. ఈ నిజాన్ని నమ్మక తప్పదు’’అని అన్నారు. ‘‘ఢిల్లీలో ఒకటిన్నర కిలోమీటర్‌ పొడవునా 8,000 మంది జనం మధ్య 14 రాజకీయ పార్టీలతో కలిసి కదం తొక్కినంత మాత్రాన రాహుల్‌గాంధీ దేశ గొంతుకగా మారిపోరు.

ప్రజాగొంతుక అనేది దేశంలో సస్యశ్యామలమైన పొలాల్లో, గ్రామాల్లో, సుదూర కొండలు, అడవులు, నదీపరివాహకప్రాంతాల్లోనూ విని్పస్తుంది. మీరు ఈ ప్రాంతాలను ఎన్నటికీ చేరుకోలేరు. బిహార్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు ఇలా చాలా రాష్ట్రాల్లో ఓటర్లు మిమ్మల్ని తిరస్కరించారు. అందుకే మీ పార్టీ తరచూ ఓడిపోతూనే ఉంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చెరి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క చోట అయినా విజయకేతనం ఎగరేయలేక చతికిలపడింది’’అని అన్నారు. ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, సీఈసీ జ్ఞానేశ్‌ వ్యతిరేక నిరసనలపై షా స్పందించారు. ‘‘తప్పుడు రాజకీయాలతో కాంగ్రెస్‌కు ఒనగూరేదేమి ఉండదు.

అయినా రాహుల్‌ పార్టీలో కీలక నేతగా ఎదిగాక, పార్టీ అధ్యక్షుడయ్యాక, దిగిపోయి తర్వాత విపక్షనేతగా ఎంపికయ్యాక సైతం పార్టీ ఎలాంటి ఘనతలు సాధించలేదు పైగా నిరాటంకంగా ఓడిపోతోంది. మరీ ముఖ్యంగా 2024లో ఎస్‌ఐఆర్‌ మొదలయ్యాక కాంగ్రెస్‌ ఓటముల జోరు ఎక్కువైంది. గతంలో గద్దెనెక్కి పరిపాలించిన గుజరాత్‌లో కాంగ్రెస్‌ గత 41 ఏళ్లుగా ఓటమిని చవిచూస్తోంది. ఈ లెక్కన ఇకనైనా రాహుల్‌ ఆత్మావలోకనం చేసుకుంటే మంచిది. కృత్రిమ మీడియా కార్యక్రమాలు, అబద్ధాలను రాజధాని నడివీధుల్లో వల్లెవేసినంత మాత్రాన మీరు ప్రజల విశ్వాసాన్ని పొందలేరు. చొరబాటుదారులను ఓటర్లుగా మార్చాలని రాహుల్‌ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు’’అని షా అన్నారు.

ఇదీ చదవండి: జంతర్‌మంతర్‌ వద్ద సీజేపీ ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement