జైపూర్: తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రశాఖ మాధుర్‌ను బాధ్యతల నుంచి తొలగిస్తూ శనివారం రాజస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాధుర్ భర్త ఐఏఎస్ శిఖర్ అగర్వాల్‌పైనా ప్రభుత్వం ఇటీవల ఇలాంటి క్రమశిక్షణ చర్యలనే తీసుకుంది. మాధుర్ పేరుతో 40కి పైగా విల్లాలు, కాటేజీలు, అగర్వాల్ పేరుతో 20 విల్లాలు ఉండటంపై అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) దర్యాప్తు జరుపుతోంది.
1995 బ్యాచ్ ఐపీఎస్ అయిన మాథుర్ అదనపు డీజీపీగా పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వెయిటింగ్ పో స్టింగ్ ఆర్డర్స్(ఏపీవో)పై ఆమెను ఉంచుతు న్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 1993 బ్యాచ్ ఐఏఎస్ అయిన ఈమె భర్త అగర్వాల్ పరిశ్రమల శాఖలో అదనపు ప్రధాన కార్య దర్శిగా పనిచేస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈయన్ను కూడా ఏపీవోపైనే ఉంచుతూ అక్టోబర్ 28వ తేదీన సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలిచ్చింది.


